Ram Nath Kovind: రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసిన రామ్ నాథ్ కోవింద్.. కొత్త నివాసం ఎక్కడంటే

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివసమైన రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి కొత్త నివాసానికి చేరుకున్నారు. ఇకపై కుటుంబంతో కలిసి 12, జన్‌పథ్‌లోనే ఉంటారు.

Ram Nath Kovind: రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసిన రామ్ నాథ్ కోవింద్.. కొత్త నివాసం ఎక్కడంటే

Ram Nath Kovind

Ram Nath Kovind: మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి కొత్త నివాస స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలోని 12, జన్‌పథ్‌ ఇకపై ఆయన నివాసంగా ఉండనుంది. ఇక్కడే ఆయన కుటుంబంతో కలిసి నివసిస్తారు.

Landlady Murder: 91సార్లు కత్తితో పొడిచి ఇంటి ఓనర్‌ హత్య

ఇక్కడ ఇంతకుముందు దివంగత, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఉండేవారు. ఆయన 2020లో మరణించారు. తర్వాత ఆయన కుటుంబం అక్కడే ఉండేది. అయితే, బలవంతంగా వారిని అక్కడ్నుంచి ఈ ఏడాది మార్చిలో ఖాళీ చేయించారు. అప్పట్నుంచి ఖాళీగా ఉంటున్న ఈ నివాసాన్ని ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్‌కు కేటాయించారు. ఈ ఇంటికి దగ్గర్లోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం ఉంది. ఆమె 10, జన్‌పథ్‌లో ఉంటున్నారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవనాన్ని వదిలేముందు ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి.

Crypto Fraud: క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం.. నాలుగు లక్షలు పోగొట్టుకున్న యువకుడు

మరోవైపు ప్రస్తుత ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం కూడా వచ్చే నెల 10న ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆయన 1, త్యాగరాజ్ మార్గ్‌ పేరుతో ఉన్న నివాసానికి చేరుకుంటారు. ఈ నివాస మార్పునకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.