రామ్ – లింగుస్వామి సినిమా ప్రారంభం..

రామ్ – లింగుస్వామి సినిమా ప్రారంభం..

Ram 19: ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్- తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ సినిమా కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.

Ram 19

ఈ చిత్రం గురువారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్, లింగుస్వామి, నిర్మాత, మూవీ టీంతో పాటు ఇదే బ్యానర్‌లో ‘సీటీమార్’ సినిమా చేస్తున్న మ్యాచో హీరో గోపిచంద్, దర్శకుడు సంపత్ నందిలతో పాటు ‘స్రవంతి’ రవి కిషోర్, రామ్ సోదరుడు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

RAM

నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

https://10tv.in/ram-pothineni-new-movie-with-director-lingusamy/