Ram Pothineni: ఇస్మార్ట్ హీరోతో లింగుస్వామి యాక్షన్.. తోడుగా దేవిశ్రీ!

టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రాజెక్టులు లైన్లో పెట్టడం.. పెద్దగా మార్కెట్ మీద కూడా ఆ ప్రభావం లేకుండా ఒకే స్థాయిని మైంటైన్ చేసే హీరోలు కొందరున్నారు. రామ్ పోతినేని ఆ వర్గానికి చెందిన హీరోగా చెప్పుకుంటారు.

Ram Pothineni: ఇస్మార్ట్ హీరోతో లింగుస్వామి యాక్షన్.. తోడుగా దేవిశ్రీ!

Ram Pothineni

Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రాజెక్టులు లైన్లో పెట్టడం.. పెద్దగా మార్కెట్ మీద కూడా ఆ ప్రభావం లేకుండా ఒకే స్థాయిని మైంటైన్ చేసే హీరోలు కొందరున్నారు. రామ్ పోతినేని ఆ వర్గానికి చెందిన హీరోగా చెప్పుకుంటారు. టాలీవుడ్ లో టాప్ ఫైవ్ డాన్స్ హీరోలలో ఒకడైన రామ్ అమ్మాయిలలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ముందు సినిమా ఫలితం ఎలా ఉన్నా తర్వాత సినిమా మీద ఫోకస్ పెడుతుంటాడు. అయితే.. కొద్ది రోజులుగా స్మార్ట్ నుండి ఇస్మార్ట్ కావాలని ఆశపడుతున్న రామ్ ఆ మేరకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు.

పూరీ జగన్నాధ్ తో రఫ్ లుక్ లో మారి ప్రేక్షకుల ముందుకు రెచ్చిన ఇస్మార్ట్ శంకర్ రామ్ లో మాస్ హీరో లక్షణాలు ఉన్నాయని నిరూపించగా తాజాగా వచ్చిన రెడ్ రిజల్ట్ తో మంచి పునాది పడ్డట్లే అయింది. ఇదే ఊపులో ఇప్పుడు మాంచి మాస్ దర్శకుడికి ఒకే చెప్పేశాడు. లింగుస్వామి అంటే తమిళంలో ఒక బ్రాండ్ ఉంది. ఆయన సినిమాలలో హీరోను ఎలివేట్ చేసే విధానానికి అక్కడ హీరోలు ఫిదా అయిపోతారు. ఆయన తమిళ సినిమాలు మన దగ్గర కూడా డబ్బింగ్, రీమేక్ అయి భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి.

తెలుగులో విశాల్ మార్కెట్ పెంచిన పందెం కోడి నుండి కార్తీ ఆవారా లాంటి సినిమా డబ్బింగ్ రూపంలో తెలుగు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. తమిళంలో వెట్టై పేరుతో విడుదలై మన దగ్గర నాగచైతన్య-సునీల్ హీరోలు వచ్చిన తడాఖా కూడా లింగుస్వామి సినిమానే. కాగా మూడేళ్లుగా కథల వేటలో ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ తో జత కడుతున్నాడు. ఇక ఈ కాంబినేషన్ కు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా తోడయ్యాడు. ఇప్పటి వరకు రామ్-దేవి కాంబినేషన్ లో వ్ వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ మ్యాజిక్ చేసినవే. మరి స్టైలిష్ యాక్షన్ దర్శకుడిగా పేరున్న లింగుస్వామి రామ్ చేత ఏ రేంజ్ యాక్షన్ చేయిస్తాడో చూడాలి మరి!