RAPO : గ్యాప్ తీసుకోకుండా బోయపాటితో మొదలు పెట్టేసిన రామ్..

రామ్ పోతినేని ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. లవర్ బాయ్, చాకోలెట్ బాయ్ లా ఉండే రామ్ పూర్తిగా మాస్ ఇమేజ్................

RAPO :  గ్యాప్ తీసుకోకుండా బోయపాటితో మొదలు పెట్టేసిన రామ్..

Ram Boyapati

Ram Pothineni :  రామ్ పోతినేని ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. లవర్ బాయ్, చాకోలెట్ బాయ్ లా ఉండే రామ్ పూర్తిగా మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మారిపోయి ఆ తర్వాత రెడ్ సినిమాలో కూడా మాస్ గానే కనపడ్డాడు.

రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. ఇందులో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనబడబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఒక సాంగ్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకొని సినిమాపై అంచనాలని పెంచాయి. ది వారియర్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూట్ పూర్తి చేసుకొని వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మరో కొత్త సినిమా మొదలు పెట్టేసాడు రామ్ పోతినేని.

Ram

Bollywood : టాలీవుడ్ వాళ్ళకి కరణ్ జోహార్.. బాలీవుడ్ వాళ్లకి రాజమౌళి.. బ్రహ్మాస్త్రతో క్లారిటీ వచ్చిందా??

మాస్ ఇమేజ్ ని కంటిన్యూ చేయాలని తన నెక్స్ట్ సినిమా కూడా పూర్తి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ గతంలోనే అనౌన్స్ చేయగా ఇవాళ జూన్ 1న పూజ కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఈ సినిమాని నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ ఆఫీస్ లో ఈ పూజా కార్యక్రమం జరిగింది. దీంతో రామ్ బోయపాటి శ్రీనుతో కలిసి మరోసారి తన మాస్ పవర్ ని చూపించడానికి సిద్దమైపోయాడు. అసలు గ్యాప్ కూడా తీసుకోకుండా వెంటనే సినిమా చేసేస్తుండటంతో రామ్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.