Ram-Raviteja Multi Starer: అనిల్ ఇద్దరు ఎనర్జటిక్ హీరోలను కలిపేస్తాడా?

ఇప్పుడున్న యువ దర్శకులలో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి పేరు చెప్పొచ్చు. కథకు కామెడీ టైమింగ్ జోడించి సినిమాను విజయతీరాలకు చేర్చే ఈ దర్శకుడు ప్రస్తుతం ఎఫ్-3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Ram-Raviteja Multi Starer: అనిల్ ఇద్దరు ఎనర్జటిక్ హీరోలను కలిపేస్తాడా?

Ram Raviteja Multi Starer

Ram-Raviteja Multi Starer: ఇప్పుడున్న యువ దర్శకులలో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి పేరు చెప్పొచ్చు. కథకు కామెడీ టైమింగ్ జోడించి సినిమాను విజయతీరాలకు చేర్చే ఈ దర్శకుడు ప్రస్తుతం ఎఫ్-3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరో వెంకీకి.. యంగ్ హీరో వరుణ్ తేజ్ ను కలిపి తమన్నా.. మెహ్రీన్ గ్లామర్ టచ్ ఇచ్చి చేసిన ఎఫ్-2 జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో ఇప్పుడు దానికి మరికాస్త డోస్ పెంచి ఎఫ్-3 గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కాగా.. ఈ సినిమా తర్వాత మరో సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్నాడని ఈ మధ్య తెగ ప్రచారం జరుగుతుంది. అయితే.. దానికి ఇంకా సమయముంది. ఎందుకంటే ప్రస్తుతం బోయపాటితో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య దాని తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కానీ అనిల్ కు అవకాశం దక్కదు. ఎఫ్-3 ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేందుకు అనిల్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఇద్దరు ఎనర్జిటిక్ హీరోలను కలపనున్నట్లు వినిపిస్తుంది.

మాస్ మహారాజ రవితేజ ఎనర్జీ గురించి మనకు తెలిసిందే కాగా కుర్ర హీరోలలో రామ్ పోతినేని కూడా సూపర్ ఎనర్జిటిక్ హీరోగా ఓ బ్రాండ్ దక్కించుకున్నాడు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి అనిల్ ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రవితేజతో అనిల్ కు మంచి స్నేహం ఉంది. ఇప్పటికే రవితో రాజా ది గ్రేట్ సినిమా చేసిన అనిల్ రామ్ తో మూడు సినిమాలకు రచయితగా పనిచేశాడు. కందిరీగ, మసాలా, పండగచేస్కో సినిమాలకు అనిల్ రావిపూడే దర్శకుడు కాగా అప్పటి నుండే రామ్ తో అనుబంధం ఉంది.

ఇప్పటికే హీరో రామ్ కు కథ చెప్పి ఒప్పించినట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే రవితేజకు కూడా కథ చెప్పనున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ ముగ్గురు కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉండనుండగా ఈ సినిమా కూడా అనిల్ సినిమాల శైలిలోనే ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూనే కామెడీ శైలిలో ఈ సినిమా ప్లాన్ చేస్తుండగా ఇందులో భారీ క్యాస్టింగ్ తో పాటు భారీ బడ్జెట్ లో రూపొందించనున్నట్లుగా తెలుస్తుంది.

Read: Anchor Pradeep: క‌న్నుమూసిన యాంక‌ర్ ప్ర‌దీప్ తండ్రి.. విషాదంలో కుటుంబం..!