Ramarao On Duty: సెన్సార్ ముగించుకున్న రామారావు.. రన్ టైమ్ ఎంతంటే?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

Ramarao On Duty: సెన్సార్ ముగించుకున్న రామారావు.. రన్ టైమ్ ఎంతంటే?

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శరత్ మండవ ఔట్ అండ్ ఔట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మాస్ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Ramarao On Duty: రామారావు మాస్ నోటిసు.. ఏముంటుందో?

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ మొదలుకొని ట్రైలర్స్ వరకు సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేస్తూ వచ్చాయి. కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా విందు భోజనం అని వారు చిత్ర యూనిట్‌కు కితాబిచ్చినట్లుగా తెలుస్తోంది.

Ramarao On Duty: కింగ్ ఆఫ్ క్రౌడ్ అంటూ రామారావు టైటిల్ సాంగ్!

అటు ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ సూపర్బ్‌గా ఉండటమే కాకుండా ఓ మంచి మెసేజ్ కూడా ఉందని వారు చిత్ర యూనిట్‌ను అభినందించారట. కాగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా 2 గంటల 26 నిమిషాల నిడివితో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే అంశాలను పుష్కలంగా పెట్టుకుని థియేటర్లలో మాస్ జాతరకు రెడీగా ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌లు హీరోయిన్లుగా నటిస్తోండగా, సామ్ సిఎస్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.