Ramarao On Duty: రామారావు తొలి రోజు వసూళ్లు.. అంతేనా?

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్ల వద్ద ఆడియెన్స్ సందడి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ సిినిమాకు ఊహించినదానికంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి.

Ramarao On Duty: రామారావు తొలి రోజు వసూళ్లు.. అంతేనా?

Ramarao On Duty First Day Collections

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

Ramarao On Duty: రామారావుకు తప్పని లీకుల బెడద!

అయితే ఈ సినిమాకు పబ్లిక్ టాక్ అంతంత మాత్రంగా రావడం.. ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు వెళ్లకపోవడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్‌పై పడింది. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున కేవలం రూ.3.42 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. సినిమాలో కంటెంట్ పరంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నా, ప్రస్తుతం వారు థియేటర్లకు వెళ్లేందుకు వెనకాడుతండటంతో ఈ విధంగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది.

Ramarao On Duty: రామారావు ఆ సినిమాకు మక్కీనా..?

ఇక ఈ సినిమా తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 0.85 కోట్లు
సీడెడ్ – 0.52 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.45 కోట్లు
ఈస్ట్ – 0.31 కోట్లు
వెస్ట్ – 0.16 కోట్లు
గుంటూరు – 0.24 కోట్లు
కృష్ణా – 0.17 కోట్లు
నెల్లూరు – 0.12 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.2.82 కోట్లు (గ్రాస్ రూ.4.75 కోట్లు)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.5 కోట్లు
ఓవర్సీస్ – 0.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.3.42 కోట్లు(గ్రాస్ రూ.5.95 కోట్లు)