పౌరాణిక సీరియల్స్ ఆటలాడి కంటి చూపు కోల్పోతున్న పిల్లలు

అవును ఇది నిజం అంటున్నారు. రామాయణం, మహాభారత్ సీరియల్స్ వల్ల కొంతమంది కంటి చూపు కోల్పోతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. సీరియల్స్ లో నటులు చేసిన విధంగా పిల్లలు కూడా అదే విధంగా చ

పౌరాణిక సీరియల్స్ ఆటలాడి కంటి చూపు కోల్పోతున్న పిల్లలు

అవును ఇది నిజం అంటున్నారు. రామాయణం, మహాభారత్ సీరియల్స్ వల్ల కొంతమంది కంటి చూపు కోల్పోతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. సీరియల్స్ లో నటులు చేసిన విధంగా పిల్లలు కూడా అదే విధంగా చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు..ఈ సీరియల్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. బాణాలు, విల్లులు తయారు చేసి..ఆడుకుంటున్నారని, ఫలితంగా..కళ్లకు గాయాలవుతున్నాయంటున్నారు. యుద్ధ సన్నివేశాలు రక్తి కట్టిస్తున్నాయి. దీనిని చూసిన పిల్లలు అదే విధంగా చేయాలని అనుకుంటున్నారు.

చీపురు పుల్లలతో బాణాలు తయార చేసి..సీరియల్స్ లో నటులు చేసిన విధంగా ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటున్నారు. ప్రమాదవశాత్తు..బాణాలు కంటికి తగులుతుండడంతో గాయాల బారిన పడుతున్నారని వైద్యులు తెలిపారు. మొట్టమొదటి కేసు 2020, ఏప్రిల్ 20వ తేదీన వచ్చిందని, చీపురుపుల్ల కంటికి గుచ్చుకోవడంతో పదేళ్ల బాలుడు గాయపడ్డాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కూడా 12 మంది పిల్లలకు గాయాలయ్యాయని, ఇందులో కొంతమందికి కంటిచూపు కూడా పోయిందని రెటినా ఇనిస్టిట్యూట్ డాక్టర్ సుబద్ర జలాలీ తెలిపారు.

భారతదేశంలో శక్తిమాన్ సీరియల్ ప్రసారమయినప్పుడు మరణాలు సంభవించాయి. సీరియల్స్ ప్రసారం చేస్తామనే ప్రకటన వెలువడే సమయంలో తాను ఒక లేఖ రాయడం జరిగిందని కంటి నిపుణుడు డాక్టర్ బిపి కశ్యప్ వెల్లడించారు. సీరియల్స్ ప్రసారమవుతున్న సమయంలో చిన్న పిల్లలను హెచ్చరిస్తూ..ప్రకటనలు వేయాలని, ఎవరూ అనుకరించవద్దని హెచ్చరించాలని తాను కోరడం జరిగిందన్నారు.

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మార్చి 24వ తేదీ నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ 2020, మే 17 వరకు కొనసాగనుంది. దీంతో గతంలో ప్రసారమయిన..ప్రఖ్యాత సీరియళ్లు మహాభారత్, రామాయణం పున:ప్రసారం చేస్తున్నారు. దూరదర్శన్ ఈ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. వీటిని ప్రజలు మరోసారి ఆదరిస్తున్నారు. అత్యధిక వీక్షకులతో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. పిల్లలను కూడా ఆకర్షిస్తున్నాయి ఈ సీరియల్స్.

Also Read | గంగా నది నీళ్లను reject చేసిన ICMR