Virataparvam : నక్సలైట్ గా సాయిపల్లవి విశ్వరూపం.. విరాటపర్వం ట్రైలర్

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఈ ట్రైలర్ లో రానా భావాలు, అతను రాసిన పుస్తకాలు నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. అతన్ని కలవడానికి ఇల్లు వదిలి............

Virataparvam : నక్సలైట్ గా సాయిపల్లవి విశ్వరూపం.. విరాటపర్వం ట్రైలర్

Virataparvam Sai Pallavi

Sai Pallavi :  రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, ప్రియమణి ముఖ్యపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. అనేక వాయిదాల అనంతరం జూన్ 17న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్ గా కనిపించబోతున్న సంగతి ముందు నుంచే తెలుసు. అయితే ఇటీవల డైరెక్టర్, రానా ఈ సినిమాలో సాయి పల్లవి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి విశ్వరూపం చూస్తారని సాయి పల్లవి గురించి ఓ రేంజ్ లో చెప్పారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాళ్ళు చెప్పింది కరక్టే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ లో రానా భావాలు, అతను రాసిన పుస్తకాలు నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. అతన్ని కలవడానికి ఇల్లు వదిలి వెళ్తుంది. నక్సలైట్ లతో సంబంధాలు ఉన్నాయని ఆమెని పోలీసులు చిత్ర హింసలు పెడతారు. చివరికి రానాకి తన ప్రేమ అర్థమయ్యేలా చెప్పి సాయి పల్లవి కూడా నక్సలైట్ గా మారుతుంది. ఇలా ఆల్మోస్ట్ సగం కథని ట్రైలర్ లోనే చూపించారు. అయితే కథ మొత్తం సాయి పల్లవి కోణంలోంచి ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో చెప్పిన రక్తపాతం ఎక్కడ లేదు.. పుట్టినప్పుడు అమ్మ కడుపులోనుంచే మొదలైంది లాంటి అద్భుతమైన డైలాగ్స్ చాలా ఉన్నాయి. ప్రేమ గురించి, యుద్ధం గురించి చాలా డైలాగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

Major Movie : అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఎందుకో తెలుసా??

ఇక ట్రైలర్ లోనే సాయిపల్లవి నట విశ్వరూపం చూపించింది. రానా, ప్రియమణి, నవీన్ చంద్ర కూడా నక్సలైట్స్ గా అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. దగ్గుబాటి అభిమానులతో పాటు సాయి పల్లవి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.