పెళ్లి కల వచ్చేసిందే బాల : రానా..మిహికా బజాజ్ ఎంగేజ్ మెంట్

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 06:06 AM IST
పెళ్లి కల వచ్చేసిందే బాల : రానా..మిహికా బజాజ్ ఎంగేజ్ మెంట్

దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి సిద్ధమౌతున్నాయి. రానా, మిహికా బజాజ్ నిశ్చితార్థ వేడుకలు కొద్ది గంటల్లో జరుగనున్నాయి. 2020, మే 20వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక జరుగబోంది. ఎంగేజ్ మెంట్ వేడుకకు రానా, మిహీకా కుటుంబసభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారని సమాచారం. కరోనా లేకపోతే..సంబరాలు వేరేగా ఉండేవి. కరోనా లాక్ డౌన్ తర్వాత..గ్రాండ్ గా వివాహం జరపాలని దగ్గుబాటి ఫ్యామిలీ ఆలోచిస్తోందని సమాచారం. 

కరోనా ఫీవర్ తో పాటు టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, జబర్దస్త్ కమెడియన్ మహేష్ వివాహం చేసుకున్నారు. త్వరలోనే రానా కూడా వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ ను ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా రానా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మిహికాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. హైదరాబాద్ చెందిన బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. ఆమె చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో రాణించడంతో..డ్యూ డ్రాప్ డిజైన్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతోంది. 

రానా తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు మ్యారేజ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ‘బాంబే టైమ్స్’తో మాట్లాడుతూ తన కుమారుడు రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసునని చెప్పారు. జీవితంలో ఒకటి కావాలని అనుకోవడం సంతోషకరమని, వివాహానికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో చెబుతామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి జరిగే అవకాశం ఉందని అన్నారు. అంతకు ముందే కూడా జరగవచ్చునని అన్నారు. అన్ని విషయాలు ఖరారైన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామన్నారు.