వావ్.. ఈ పుట్టగొడుగులుంటే టార్చితో పనే లేదు… విస్మయం కలిగిస్తున్న అరుదైన ఎలక్ట్రిక్ మష్రూమ్స్.. ధగధగ మెరిసిపోతున్నాయి

సాధారణంగా పుట్టగొడుగులు అదేనండి మష్రూమ్స్.. తెలుపు రంగులో ఉంటాయని తెలుసు. ఆరోగ్యానికి ఎంతో మంచిదనీ తెలుసు. పుట్టగొడుగులో పలు పోషకాలు ఉంటాయని, అవి హెల్త్ కి మేలు చేస్తాయని తెలుసు. ఆహారంలో భాగంగా చాలామంది వీటిని తింటారు. కానీ, పుట్టగొడుగులు జిగేల్ మనేలా ప్రకాశిస్తాయని, టార్చి లైట్ లా వెలుతురునిస్తాయని మీకు తెలుసా. ఏంటి.. నమ్మకం కలగడం లేదా. అవును.. ఆ పుట్టగొడుగులు జిగేల్ మని మెరుస్తాయి. అచ్చం టార్చి లైట్ లా వెలుతురునిస్తాయి. అక్కడి స్థానికులు ఆ పుట్టగొడుగులనే టార్చిలైట్ లా వినియోగిస్తారు.

వావ్.. ఈ పుట్టగొడుగులుంటే టార్చితో పనే లేదు… విస్మయం కలిగిస్తున్న అరుదైన ఎలక్ట్రిక్ మష్రూమ్స్.. ధగధగ మెరిసిపోతున్నాయి
ad

Electric Mushrooms : సాధారణంగా పుట్టగొడుగులు అదేనండి మష్రూమ్స్.. తెలుపు రంగులో ఉంటాయని తెలుసు. ఆరోగ్యానికి ఎంతో మంచిదనీ తెలుసు. పుట్టగొడుగులో పలు పోషకాలు ఉంటాయని, అవి హెల్త్ కి మేలు చేస్తాయని తెలుసు. ఆహారంలో భాగంగా చాలామంది వీటిని తింటారు. కానీ, పుట్టగొడుగులు జిగేల్ మనేలా ప్రకాశిస్తాయని, టార్చి లైట్ లా వెలుతురునిస్తాయని మీకు తెలుసా. ఏంటి.. నమ్మకం కలగడం లేదా. అవును.. ఆ పుట్టగొడుగులు జిగేల్ మని మెరుస్తాయి. అచ్చం టార్చి లైట్ లా వెలుతురునిస్తాయి. అక్కడి స్థానికులు ఆ పుట్టగొడుగులనే టార్చిలైట్ లా వినియోగిస్తారు.

mushroom

మేఘాలయలో ప్రకాశించే అరుదైన పుట్టగొడుగులని సైంటిస్టులు కనుగొన్నారు. అక్కడి స్థానికులు వాటిని నేచురల్ టార్చిలా వినియోగిస్తారు. లక్షా 20వేల ఫంగీ జాతులు ఉండగా.. అందులో కేవలం 100 మాత్రమే.. స్వయం ప్రకాశాన్ని ఇస్తాయి.

mushrooms meghalaya

మాన్సూన్ లో భారత్, చైనాకి చెందిన సైంటిస్టుల బృందం అసోంలోని ఫోరె అనే ఫంగల్ పై స్టడీ చేసింది. రెండు వారాల స్టడీలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. పెద్ద సంఖ్యలో వైవిధ్యమైన ఫంగీని కనుగొన్నారు. వందల సంఖ్యలో ఫంగీ జాతులు ఉన్నాయి. అందులో కొన్ని సైన్స్ కి కొత్త.

mushrooms glow meghalaya

ఇదే సమయంలో స్థానికుల ద్వారా ఎలక్ట్రిక్ మష్రూమ్స్ గురించి సైంటిస్టులకు తెలిసింది. దాంతో వారు మేఘాలయలోని వెస్ట్ జయంతియా హిల్స్ కి వెళ్లారు. స్థానిక వ్యక్తి ఒకరు.. సైంటిస్టుల బృందాన్ని చిమ్మ చీకటి వేళ దట్టమైన అడవికి తీసుకెళ్లాడు. చేతిలో ఉన్న టార్చి లైట్లను ఆపేయాలని అతడు చెప్పాడు. కొంత దూరం వెళ్లాక వారికి ఏదో వెలుతురు కనిపించింది. టార్చిలైట్ల నుంచి వస్తున్న వెలుతురు మాదిరిగా ఉంది. ఎంతో ప్రకాశవంతంగా ఉంది. వెదురు బొంగులు మిలమిల మెరిసిపోతున్నాయి. దగ్గరికి వెళ్లి చూడగా వెదురు బొంగుల అంచుల్లో పుట్టగొడుగులు ఉన్నాయి. అవి మెరిసిపోతున్నాయి. వాటి ద్వారానే లైటింగ్ వస్తోంది. ఫంగస్ కారణంగా అవి స్వయం ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. దీన్ని బయోలుమినిసెన్స్ అంటారు.

glow-mushrooms

పుట్టగొడుగుల్లో ఇది కొత్త జాతి అని సైంటిస్టులు చెప్పారు. ప్రపంచంలో బయోలుమినిసెంట్(ప్రకాశిత జీవం) ఫంగీకి సంబంధించి 97 జాతులు ఉన్నాయి. అందులో ఇదీ ఒకటి. మేఘాలయలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో తొలుత గుర్తించారు. ఆ తర్వాత వెస్ట్ జెనితియా హిల్స్ జిల్లాలో కనిపించింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. స్వయంగా ప్రకాశిస్తున్న వెదురు బొంగులను స్థానికులు టార్చిలైట్ లా వినియోగిస్తున్నారు. అడవిలో రాత్రి పూట వెలుతురు కోసం వారు వీటిని వాడుతున్నారు. ఈ వెదురు బొంగులను ల్యాబ్ కి తీసుకెళ్లిన సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ తరహా పుట్టగొడుగులు కొత్త జాతికి చెందినవిగా గుర్తించారు.

ఇలా ప్రకాశించే ఫంగీలో కొన్ని జాతులను మాత్రమే ఇండియాలో కనుగొన్నారు. వెస్ట్రన్ ఘాట్స్ లో రెండు, ఈస్ట్రన్ ఘాట్స్ లో ఒకటి, కేరళలో మరొకటి గుర్తించారు. మహారాష్ట్ర, గోవా అడవుల్లోనూ గ్లోయింగ్ ఫంగీని గుర్తించారు.