Raveena Tandon: హాలీవుడ్‌ను అనుకరించడం వల్లే బాలీవుడ్‌కు ప్రేక్షకులు దూరం: రవీనా టాండన్

బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్‌ను అనుకరిస్తూ మాస్‌కు దూరమవుతున్నాయని అభిప్రాయపడ్డారు నటి రవీనా టాండన్.

Raveena Tandon: హాలీవుడ్‌ను అనుకరించడం వల్లే బాలీవుడ్‌కు ప్రేక్షకులు దూరం: రవీనా టాండన్

Raveena Tandon (2)

Raveena Tandon: దక్షిణాది చిత్రాలు ఇండియన్ కల్చర్‌కు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్‌ను అనుకరిస్తూ మాస్‌కు దూరమవుతున్నాయని అభిప్రాయపడ్డారు నటి రవీనా టాండన్. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘కేజీఎఫ్-2’. గత వారం విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా రవీనా టాండన్ మీడియాతో మాట్లాడారు.

KGF2: కేజీయఫ్-2 5 రోజుల కలెక్షన్స్.. దంగల్ పై కన్నేసిన రాఖీ భాయ్!

దక్షిణాది చిత్రాలు, బాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య ఉన్న తేడా గురించి ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘90లలో పాశ్చాత్య దేశాల సంస్కృతికి దగ్గరగా ఉండేలా మెలోడియస్, మ్యూజికల్ చిత్రాలు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలకు దగ్గరగా ఉండేవి. దీంతో బాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ కల్చర్ తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో నేను కొన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాను. అక్కడ వాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీశారు.

KGF2: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కేజీయఫ్-2

దీంతో ప్రేక్షకులు వాటిలో తమను తాము చూసుకుని, ఆ సినిమాల్ని సూపర్‌హిట్ చేశారు. బాలీవుడ్‌లో అలాంటి చిత్రాలు తగ్గాయి. దీంతో మాస్ ప్రేక్షకులు దూరమయ్యారు’’ అని రవీనా టాండన్ వ్యాఖ్యానించారు. ఇక ‘కేజీఎఫ్: చాప్టర్-2’ ఐదు రోజుల్లో ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.