Raviteja Khiladi Update: టైం అండ్ డేట్ ఫిక్స్ చేసిన మాస్ మహారాజా!

మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది మాస్ మహారాజనే కాగా ఇప్పుడు అదే ఊపులో తన తర్వాత సినిమాను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు.

Raviteja Khiladi Update: టైం అండ్ డేట్ ఫిక్స్ చేసిన మాస్ మహారాజా!

Raviteja Khiladi Update: మాస్ మహారాజా రవితేజ ఆ మధ్య కాస్త విజయాలకు దూరం జరిగేదని చర్చలు జరిగాయి కానీ అంతకు ముందు సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న టైంలో అతని పట్టుకోవడం.. తట్టుకోవడం కూడా కష్టమే అనిపించింది. అయితే.. ఇప్పుడు క్రాక్ సక్సెస్ తో మళ్ళీ ఆ రేంజ్ ఊపు కనిపిస్తుంది అతనిలో. మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది మాస్ మహారాజనే కాగా ఇప్పుడు అదే ఊపులో తన తర్వాత సినిమాను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు.

Raviteja Khiladi Update

Raviteja Khiladi Update

రాక్షసుడు వంటి థ్రిల్లర్ ను తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మతో రవితేజ చేస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమా ఖిలాడిను సూపర్ స్పీడ్ గా స్టార్ట్ చేసి వచ్చే నెలలోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమా మీద హైప్ పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేశారు. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ సినిమా యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో రవితేజ లుక్ తన పేరుకు తగ్గట్లే మాస్ మహారాజాను సార్ధకం చేసుకుంది.

రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి మరియు సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రమేష్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎలివేటెడ్ లొకేషన్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో తెరకెక్కిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే మే నెల చివరిలోనే ఖిలాడీ వెండితెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.