Anantapur : హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. సినిమా రేంజ్‌లో ట్విస్టులు!

రాయలసీమ - బెంగళూరు హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. అనంతపురంలో జరిగిన బోనాల పండుగకు హాజరైన బెంగళూరు హిజ్రాలు రాయలసీమ హిజ్రాలతో గొడవకు దిగారు. రాయలసీమ గ్యాంగ్ లో అలజడి సృష్టించేందుకు ఆ గ్యాంగ్ కి చెందిన హిజ్రాను బెంగళూరు బ్యాచ్ కిడ్నాప్ చేసింది.

10TV Telugu News

Anantapur : అనంతపురంలో గ్యాంగ్ వార్ టెన్షన్ రేపుతోంది. రాయలసీమ – బెంగళూరు హిజ్రాల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్ వరకు చేరింది. వివరాల్లోకి వెళితే అనంతపురం కేంద్రంగా రాయలసీమ హిజ్రాల సంఘం ఇటీవల ఆషాడ బోనాల పండుగ నిర్వహించింది. ఈ వేడుకలకు బెంగళూరుకు చెందిన హిజ్రాల సంఘం నుంచి కొందరు హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన సమయంలో రాయలసీమ హిజ్రాల బ్యాచ్ మధ్య మంచి ఐఖ్యత ఉన్నట్లు బెంగళూరు హిజ్రాలు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే వారి మధ్య గొడవ సృష్టించాలని పథకం పన్ని రాయలసీమ బ్యాచ్ లోని హిజ్రాను కిడ్నాప్ చేశారు. ఈ విషయం రాయలసీమ బ్యాచ్ కి తెలియడంతో ప్రతీకారంగా బెంగళూరు బ్యాచ్ హిజ్రాలలో ఒకరిని కిడ్నాప్ చేశారు. దీంతో రెండు బ్యాచ్ లమధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలోనే రాయలసీమ బ్యాచ్‌కు చెందిన ఒకరిపై అటాక్ చేసిన బెంగళూరు గ్యాంగ్ నగలు, డబ్బుతో ఉడాయించింది. దీంతో ప్రస్టేజ్‌గా తీసుకున్న రాయలసీమ బ్యాచ్ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్దమైంది. తమ వైపు వాళ్లను వదిలితే, మీ వైపు వాళ్లను వదులుతామంటూ ఇరు వర్గాలు పరస్పరం డీల్ కుదుర్చునేందుకు మంతనాలు జరుపుతున్నాయి.

వీరి వివాదం పెద్దది కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఇరు వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

10TV Telugu News