Credit Cards: క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లకు ఆర్‌బీఐ అనుమతి

క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆర్‌బీఐ. త్వరలో యూపీఐతో లింక్ చేసి క్రెడిట్ కార్డులతో కూడా పే చేయవచ్చు. ఇప్పటివరకు బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుంచి మాత్రమే యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉండేది.

Credit Cards: క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లకు ఆర్‌బీఐ అనుమతి

Credit Cards

Credit Cards: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆర్‌బీఐ. త్వరలో యూపీఐతో లింక్ చేసి క్రెడిట్ కార్డులతో కూడా పే చేయవచ్చు. ఇప్పటివరకు బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుంచి మాత్రమే యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉండేది. అలాగే డెబిట్ కార్డులతో కూడా పే చేసే అవకాశం ఉంది. తాజాగా క్రెడిట్ కార్డులతో కూడా యూపీఐ విధానంలో పే చేసే అవకాశం కల్పించనుంది ఆర్‌బీఐ. అయితే, ముందుగా ‘రూపే’ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. తర్వాత మాస్టర్ కార్డ్, వీసా కార్డులను కూడా ఈ విధానంలో అనుమతిస్తారు. యూపీఐ విధానం అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ చాలా ఈజీ అయ్యాయి. చేతిలో కరెన్సీ లేకుండానే ట్రాన్సాక్షన్స్, షాపింగ్ చేయొచ్చు. ప్రస్తుతం దేశంలో భారీ స్థాయిలో యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు

గత మేలోనే 590 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ దాదాపు రూ.10.4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా మొత్తం 26 కోట్ల వినియోగదారులు, ఐదు కోట్ల వ్యాపారులు యూపీఐ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డులతో కూడా పే చేసే అవకాశం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ ట్రాన్సాక్షన్స్ విలువ మరింత భారీ స్థాయిలో పెరగనుంది. ప్రస్తుతం యూపీఐ విధానంలో క్రెడిట్ కార్డులను లింక్ చేసే సిస్టమ్ డెవలప్ చేస్తున్నామని, త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.