Mastercard: మాస్టర్ కార్డులపై నిషేధం ఎత్తివేత

వినియోగదారుల పేమెంట్స్ డాటాకు సంబంధించిన సమాచారం భద్ర పరిచే అంశంలో నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డులపై గత ఏడాది జూలై 14న ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రకారం కొత్త కస్టమర్లకు క్రెడిట్, డెబిట్, ప్రిపెయిడ్ కార్డులు జారీ చేయకూడదు.

Mastercard: మాస్టర్ కార్డులపై నిషేధం ఎత్తివేత

Mastercard

Mastercard: మాస్టర్ కార్డులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్‌బీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల పేమెంట్స్ డాటాకు సంబంధించిన సమాచారం భద్ర పరిచే అంశంలో నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డులపై గత ఏడాది జూలై 14న ఆర్‌బీఐ నిషేధం విధించింది. ఈ నిషేధం ప్రకారం కొత్త కస్టమర్లకు క్రెడిట్, డెబిట్, ప్రిపెయిడ్ కార్డులు జారీ చేయకూడదు.

AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల

అయితే, తాజాగా మాస్టర్ కార్డ్ ఆసియా/పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా అనిపించడంతో ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్‌బీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. దేశంలో జరిగే లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని దేశంలోనే భద్రపరచాలని ఆర్‌బీఐ 2018 ఏప్రిల్ 6న కార్డు నిర్వహణా సంస్థలను ఆదేశించింది. ఇందుకోసం ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. అయితే, నిర్ణీత గడువు పూర్తైనా మాస్టర్ కార్డు ఈ నిబంధన అమలు చేయలేదు. దీంతో మాస్టర్ కార్డుపై నిషేధం విధించింది. దీని ప్రకారం దేశంలో కొత్త కార్డులు జారీ చేయకూడదు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

ఇప్పుడు ఆర్‌బీఐ నిషేధం ఎత్తివేయడంతో మాస్టర్ కార్డు సంస్థ కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టనుంది. మాస్టర్ కార్డుపై నిషేధం ఉండటంతో కొంతకాలంగా ఈ సంస్థతో భాగస్వామ్యం ఉన్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషన్ కార్డులు కూడా జారీ కాలేదు. దేశీయ బ్యాంకులు రూపే కార్డులు, వీసా కార్డులు మాత్రమే జారీ చేశాయి.