RBI Digital Rupee : డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది.. డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి.. ఫస్ట్ 4 నగరాల్లో ప్రారంభం.. ఆర్బీఐ కీలక ప్రకటన!

RBI Digital Rupee : భారత్‌లో డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన రిటైల్ డిజిటల్ రూపీలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

RBI Digital Rupee : డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది.. డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి.. ఫస్ట్ 4 నగరాల్లో ప్రారంభం.. ఆర్బీఐ కీలక ప్రకటన!

RBI to launch first pilot for digital Rupee on Dec 1, to be tested in 4 cities initially

RBI Digital Rupee : భారత్‌లో డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన రిటైల్ డిజిటల్ రూపీలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దాంతో డిజిటల్ రూపాయి ఎట్టకేలకు రియాలిటీ అవుతోంది. RBI e-రూపీ డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుందని, చట్టబద్ధమైన టెండర్‌ను సూచిస్తుంది. ఫస్ట్ రిటైల్ కోసం పైలట్ ప్రాతిపదికన ప్రారంభించనుంది. అయితే, ప్రస్తుతానికి రిటైల్ కస్టమర్లందరికీ డిజిటల్ రూపాయి అందుబాటులో ఉండదు. పైలట్ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (CUG)లోని ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

RBI to launch first pilot for digital Rupee on Dec 1, to be tested in 4 cities initially

RBI to launch first pilot for digital Rupee on Dec 1, to be tested in 4 cities initially

ఇందులో కస్టమర్‌లు, వ్యాపారులందరూ భాగస్వాములుగా ఉంటారు. ప్రస్తుతం పేపర్ కరెన్సీ, నాణేలను జారీ చేసే డినామినేషన్స్‌లోనే డిజిటల్ రూపాయి కూడా జారీ చేయనుంది ఆర్బీఐ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో డిజిటల్ రూపాయిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ రూపాయి విషయానికి వస్తే.. ప్రస్తుతం పేపర్ కరెన్సీ నోట్లు, నాణేల విలువతో సమానంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ డిజిటల్ రూపాయిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆర్బీఐ అధికారులు పేర్కొన్నారు. కస్టమర్లు డిజిటల్ వాలెట్లు, మొబైల్ ఫోన్లు లేదా బ్యాంకు ధృవీకరించిన డివైజ్‌ల ద్వారా డిజిటల్ రూపాయి లావాదేవీలు చేసుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది.

డిజిటల్ రూపాయి ఫీచర్లు ఏంటి, చెల్లింపులు ఎలా? :
డిజిటల్ రూపాయి లావాదేవీలు వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి పంపుకోవచ్చు. అంతేకాదు.. షాపుల్లో ఉంచిన QR కోడ్‌లను ఉపయోగించి దుకాణదారునికి కూడా చెల్లించవచ్చని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రజలంతా తమ బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేయవచ్చు. డబ్బు మార్పిడికి సులభమైన మార్గంగా చెప్పవచ్చు. నగదు విషయానికొస్తే.. డిజిటల్ రూపాయి ఎలాంటి వడ్డీని పొందలేరు. కానీ బ్యాంకుల్లో డిపాజిట్లు వంటి ఇతర రకాల నగదుకు మార్చుకోవచ్చు. డిజిటల్ రూపాయి భౌతిక నగదు ఫీచర్లను కూడా అందిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా డిజిటల్ రూపాయిలను జారీ చేయడంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలి అనేది పరీక్షించనున్నారు.

Read Also : RBI CBDC Digital Rupee : దేశంలో తొలిసారి డిజిటల్‌ రూపాయి.. నేటి నుంచి చలామణిలోకి..

ముందుగా 4 నగరాల్లో.. మొత్తం 8 బ్యాంకులు..
డిజిటల్ రూపాయి ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌తో సహా నాలుగు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, హువాజాతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా వంటి నగరాల్లో అందుబాటులోకి వస్తుంది. డిజిటల్ రూపాయి క్రమంగా మరిన్ని బ్యాండ్‌లు, వినియోగదారులు, వారి లొకేషన్లకు విస్తరించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అదనంగా.. ఈ పైలట్ టెస్టులో మొత్తం 8 బ్యాంకులు పాల్గొంటాయి. అయితే, మొదటి దశలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, Yes బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్‌తో సహా 4 బ్యాంకులతో మాత్రమే ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో సహా మిగిలిన నాలుగు బ్యాంకులు త్వరలో చేరనున్నాయి.

RBI to launch first pilot for digital Rupee on Dec 1, to be tested in 4 cities initially

RBI to launch first pilot for digital Rupee on Dec 1, to be tested in 4 cities initially

డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? :
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) లేదా డిజిటల్ రూపాయి.. RBI ద్వారా జారీ అయిన కరెన్సీగా చెప్పవచ్చు. ఫిజికల్ రూపంలోని కరెన్సీ నోట్స్, నాణేలకు డిజిటల్ వేరియంట్ అని చెప్పవచ్చు. డిజిటల్ కరెన్సీ లేదా డిజిటల్ రూపీ అనేది నగదుకు ఒక ఎలక్ట్రానిక్ రూపమని చెప్పవచ్చు. కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కూడా ఈ డిజిటల్ రూపీని ఉపయోగించవచ్చు. కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పించిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also : iPhone 14 Pro Models : ఈ హాలీడే సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనుగోలు కష్టమే.. ఎందుకో తెలుసా?

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..