RC 15 : అవన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన RC 15 చిత్ర యూనిట్..

ఇటీవల RC 15 సినిమా కోసం నటీనటుల్ని తీసుకుంటున్నారని, ఇందులో ఫలానా వాళ్ళు నటిస్తున్నారని, టైటిల్ ఇదే అని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది.

RC 15 : అవన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన RC 15 చిత్ర యూనిట్..

Ram Charan

RC 15 :  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ సినిమాని నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో చరణ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడని ఇప్పటికే లీకైన కొన్ని ఫొటోలతో తెలిసిపోతుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అన్ని పరిశ్రమల నుంచి ముఖ్య ఆర్టిస్టులు నటిస్తున్నారు. వచ్చే సమ్మర్ లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

Priyanka Chopra : మెక్సికో బీచ్‌లో ప్రియాంక చోప్రా బర్త్‌డే సెలబ్రేషన్స్..

ఇటీవల RC 15 సినిమా కోసం నటీనటుల్ని తీసుకుంటున్నారని, ఇందులో ఫలానా వాళ్ళు నటిస్తున్నారని, టైటిల్ ఇదే అని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్, శంకర్ సినిమా గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని, మా ప్రాజెక్ట్‌లో ఏదైనా పాత్ర కోసం వ్యక్తులను నటించడానికి ఎవర్ని తీసుకోవట్లేదని, మా పేరు చెప్పి అలా చేయడానికి ఏ వ్యక్తికి లేదా ఏజెన్సీకి అధికారం లేదని తెలుపుతూ ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలని, జాగ్రత్తగా ఉండాలని మేము స్పందిస్తున్నాము అని ఓ లేఖని విడుదల చేసింది.