ఓల్డ్‌ మలక్‌పేట్‌లో కొనసాగుతున్న రీ పోలింగ్‌.. 9గంటల వరకు 4.44 శాతం పోలింగ్‌

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 10:52 AM IST
ఓల్డ్‌ మలక్‌పేట్‌లో కొనసాగుతున్న రీ పోలింగ్‌.. 9గంటల వరకు 4.44 శాతం పోలింగ్‌

Old Malakpet re-polling : హైదరాబాద్ ఓల్డ్‌ మలక్‌ పేట్ 26 వ డివిజన్‌లో రీ పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 69 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో పొరపాటు దొర్లడంతో డిసెంబర్‌ 1న పోలింగ్‌ను అధికారులు నిలిపేశారు.



సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలి బదులు.. సీపీఎం సింబల్‌ అయిన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుని ముద్రించడంతో పోలింగ్‌ వాయిదా పడింది. తాజాగా సీపీఐ అభ్యర్థి గుర్తును సరిచేసి.. కొత్త బ్యాలెట్లను ముద్రించారు అధికారులు. ఈ డివిజన్‌ పరిధిలో ఉన్న 69 పోలింగ్ స్టేషన్‌లలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు.



26వ డివిజన్‌లో మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 54 వేల 655 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. 26వ వార్డులో మొన్న ఓటు వేసిన వారికి ఎడమచేతి చూపుడు వేలికి సిరా పెట్టగా… ఇప్పుడు ఎడమ చేతి మధ్య వేలికి సిరా పెడుతున్నారు.