Realme C30 : రియల్ నుంచి C సిరీస్ కొత్త బడ్జెట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడు.. ఫీచర్లు ఇవేనా?

Realme C30 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ నుంచి కొత్త C సిరీస్ ఫోన్ వస్తోంది. ఈ నెల (జూన్) 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ Realme నెక్ట్స్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం లాంచ్ తేదీని ప్రకటించింది.

Realme C30 : రియల్ నుంచి C సిరీస్ కొత్త బడ్జెట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడు.. ఫీచర్లు ఇవేనా?

Realme C30 India Launch Date Announced, Here Is What To Expect

Realme C30 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ నుంచి కొత్త C సిరీస్ ఫోన్ వస్తోంది. ఈ నెల (జూన్) 20న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ Realme నెక్ట్స్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. Realme C30 ఎలా ఉంటుందో కంపెనీ వెల్లడించింది. రియల్‌మి C-సిరీస్ ఫోన్‌ల మాదిరిగానే కొత్త ఫోన్ డిజైన్‌ ఉండనుంది. కానీ, ఈ ఫోన్ వెనుక భాగంలో కొత్త లైన్ ప్యాటర్న్‌ ఉండే అవకాశం ఉంది. యూజర్లను ప్రత్యేకంగా ఆకర్షించేలా డిజైన్ ఉండనుంది. Realme ఫోన్ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ధృవీకరించలేదు. రియల్ మి C30 8.5mm సన్నగా ఉంటుందని 182 గ్రాముల బరువు ఉంటుందని కంపెనీ తెలిపింది.

Realme C30 లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
జూన్ 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ Realme C30 బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఆన్ లైన్ ఓన్లీ ఈవెంట్లో లాంచింగ్ జరుగనుంది. ఈవెంట్లో ఫోన్ ధర ఎంత అనేది Realme ప్రకటించే అవకాశం ఉంది.

Realme C30 స్పెసిఫికేషన్స్ :
Realme C30 స్పెసిఫికేషన్‌లు ఈవెంట్‌లో కంపెనీ రివీల్ చేయనుంది. MySmartPrice ప్రకారం.. Realme C30 రెండు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. Realme C30లో 2GB RAM ఆప్షన్, 3GB RAM ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజీ 32GB వద్ద మాత్రమే అందుబాటులో ఉండనుంది. వాస్తవానికి, బడ్జెట్ విభాగానికి చెందిన స్మార్ట్ ఫోన్.. అందుకే మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కంపెనీ అందిస్తోంది. అలాగే, Realme C30 తక్కువ 2GB RAMతో రానుంది. వేగవంతమైన పర్ఫార్మెన్స్ Android 11 (Go ఎడిషన్)ని ఉపయోగించే అవకాశం ఉంది. Realme C30 డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ బ్యాంబూ గ్రీన్ రంగులలో వస్తుందని నివేదిక పేర్కొంది.

Realme C30 India Launch Date Announced, Here Is What To Expect (1)

Realme C30 India Launch Date Announced, Here Is What To Expect 

మిగిలిన Realme C30 స్పెసిఫికేషన్‌లలో ఆక్టా-కోర్ Unisoc T612 ప్రాసెసర్ ఉంది. 12nm ప్రాసెస్‌పై పనిచేస్తుంది. ఎంట్రీ-లెవల్ ప్రాసెసర్, C30 పర్ఫార్మెన్స్ అందిస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుందని అంచనా. ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఒక రోజు కన్నా ఎక్కువసేపు ఉంటుంది.

ఎందుకంటే ఫోన్ హార్డ్‌వేర్ పెద్దగా డిమాండ్ చేయదు. బ్యాటరీ 10W ఛార్జింగ్‌కు సపోర్టు చేయనుంది. Realme C30 ఫోటో డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ ఉండనుంది. లోపల కెమెరా కూడా ఉంది. ప్రస్తుతానికి, కెమెరా రిజల్యూషన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. Realme C30 ఫీచర్లను పూర్తిగా వెల్లడించడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.. డిస్‌ప్లే, ప్రధాన కెమెరా స్పెసిఫికేషన్‌లు జూన్ 20న లాంచ్ ఈవెంట్లో కంపెనీ వెల్లడించనుంది.

Read Also : Realme C30 : రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?