ఆదిపురుష్ ఆరంభం | Rebel Star Prabhas Adipurush Aarambh

‘ఆదిపురుష్’ ఆరంభం..

‘ఆదిపురుష్’ ఆరంభం..

Rebel Star: రెబల్‌ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’ టీమ్ అప్ డేట్స్‌తో అదరగొడుతోంది. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్‌ మంగళవారం సినిమాను లాంఛనంగా ప్రారంభించింది.

ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘‘ఆది పురుష్’ ఆరంభ్’’ అంటూ టైటిల్ లోగోతో ట్వీట్ చేశారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

https://10tv.in/adipurush-prabhas-fan-made-poster-viral/

టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

 

×