రామగుండంలో ‘రెబల్ స్టార్’

రామగుండంలో ‘రెబల్ స్టార్’

Rebel Star Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో సినిమాని లాంఛనంగా ప్రారంభించారు.

జనవరి 29 నుండి ఫిబ్రవరి 12 వరకు ‘సలార్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు.

https://10tv.in/gorgeous-and-versatile-actress-shruti-haasan-on-board-for-salaar/

ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా రామగుండం కమిషనరేట్‌కు వచ్చి రామగుండం సీపీ సత్యనారాయణతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కు సీపీ సత్యనారాయణ సిబ్బందిని పరిచయం చేశారు. ప్రభాస్‌తో పాటు పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు.

Prabhas