వామ్మో కరోనా.. 24 గంటల్లో 9887 కేసులు, 294 మరణాలు.. వారం రోజుల్లోనే 6వ స్థానం

దేశంలో కరోనా వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని

  • Published By: naveen ,Published On : June 6, 2020 / 05:07 AM IST
వామ్మో కరోనా.. 24 గంటల్లో 9887 కేసులు, 294 మరణాలు.. వారం రోజుల్లోనే 6వ స్థానం

దేశంలో కరోనా వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని

దేశంలో కరోనా వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. కంటికి కనిపించని శత్రువు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్‌లో గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 9887 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసులే కాదు మరణాలు పెరుగుగుతున్నాయి. కొత్తగా 294 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2లక్షల 36వేల 657కి చేరగా, మృతుల సంఖ్య 6వేల 642కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో లక్ష 14వేల 72మంది కోలుకున్నారు. మరో లక్ష 15వేల 942మంది వేర్వురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 6వ స్థానం:
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానంలో ఉంది. దేశంలో మృతుల సంఖ్య ఇలాగే కొనసాగితే తొందర్లోనే కెనడాను (7703)ను దాటే అవకాశం ఉంది. వారం రోజుల క్రితం 9వ స్థానంలో ఉన్న భారత్‌ కేవలం ఏడు రోజుల వ్యధిలో ఆరో స్థానానికి చేరింది. దేశంలో రికవరీ రేటు శుక్రవారం కంటే కొద్దిగా తగ్గి 48.20 శాతానికి చేరింది. నిన్న(జూన్ 5,2020) ఇది 48.27 శాతం ఉంది.

80వేల కరోనా కేసులతో టాప్ లో మహారాష్ట్ర:
మన దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర (80వేల 229) మొదటిస్థానంలో ఉంది. 28వేల 694 పాజిటివ్‌ కేసులతో తమిళనాడు, 26వేల 334 కరోనా కేసులతో ఢిల్లీ వరుగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌ (19వేల 94), రాజస్థాన్‌ (10వేల 84), ఉత్తరప్రదేశ్‌ (9వేల 733), మధ్యప్రదేశ్‌ (8వేల 996), పశ్చిమబెంగాల్‌ (7వేల 303) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ లో సడలింపులు తర్వాత పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో ఇటలీని దాటి భారత్ 6వ స్థానానికి చేరింది. 2లక్షల 34వేల 531 కేసులతో ఇటలీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉండగా, లక్ష 87వేల 400 కేసులతో పెరూ 8వ స్థానానికి ఎగబాకింది. 19లక్షల 35వేల 432 కేసులతో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కంటిన్యూ అవుతోంది.

కేసుల వారీగా తొలి 10 స్థానాల్లో ఉన్న దేశాలు:
అమెరికా – 19,35,432
బ్రెజిల్ – 6,46,006
రష్యా – 4,49,834
స్పెయిన్ – 2,88,058
బ్రిటన్ – 2,83,311
భారత్ – 2,36,657
ఇటలీ – 2,34,531
పెరూ- 1,87,400
జర్మనీ- 1,85,413
టర్కీ – 1,68,340