తెలంగాణలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

  • Published By: madhu ,Published On : July 3, 2020 / 06:20 AM IST
తెలంగాణలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో సొంత ఊర్లకు వెళ్లిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు.

టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఇదిలా ఉంటే…2020, జులై 02వ తేదీ గురువారం ఒక్కరోజే..1213 కేసులు నమోదయ్యాయి. 5356 శాంపిల్స్ ను పరీక్షించగా..అన్ని కేసులు రికార్డయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 18 వేల 570కి చేరింది. ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. 1213 కేసుల్లో GHMCలోనే 998 మంది వైరస్ బారిన పడ్డారు.

మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 275కి చేరింది. బుధవారం 987 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 9069కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9226 యాక్టివ్ కేసులున్నాయి.

జిల్లాల వారిగా కేసుల వివరాలు : –
* జీహెచ్ఎంసీ 998.  * రంగారెడ్డి 48.  * మేడ్చల్ 54.  * సంగారెడ్డి 7.  * కరీంనగర్ 5.  * మహబూబ్ నగర్ 7.  * గద్వాల 01.  * సూర్యాపేట 04.  * ఖమ్మం 18.  * కామారెడ్డి 02.  * నల్గొండ 08. * సిద్ధిపేట 01.  * ములుగు 04.  * వరంగల్ రూరల్ 10. * జగిత్యాల 04.  * మహబూబాబాద్ 05. * నిర్మల్ 04.  * మెదక్ 01.  * యాదాద్రి 01.  * నిజామాబాద్ 05.  * వరంగల్ అర్బన్ 09.  * భద్రాద్రి కొత్తగూడెం 07.  * నారాయణపేట 02.  * నాగర్ కర్నూలు 01. *  రాజన్న సిరిసిల్ల 06.  * వికారాబాద్ 01.    * మొత్తం 1, 213.

Read:గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌‌పై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ!