హెబా గ్లామర్.. రామ్ ఎనర్జీ.. ‘డించక్ డించక్ ఢింకా’..

హెబా గ్లామర్.. రామ్ ఎనర్జీ.. ‘డించక్ డించక్ ఢింకా’..

RED: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా.. ‘రెడ్’.. కృష్ణ పోతినేని సమర్పణలో, శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రెడ్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. రీసెంట్‌గా ఈ సినిమాలో హెబా పటేల్ చేసిన ‘డించక్ డించక్ ఢింకా’ అనే స్పెషల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

మణిశర్మ ట్యూన్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా సాకేత్, కీర్తనా శర్మ పాడారు. జానీ మాస్టర్ మాంచి మాస్ మసాలా మూమెంట్స్ కంపోజ్ చేశారు. హెబా పటేల్ గ్లామర్ డోస్ పెంచి రెచ్చిపోయింది. తన స్టెప్పులతో కుర్రకారుకి, మాస్ ప్రేక్షకులకి కిక్ ఇచ్చింది. ఇక రామ్ ఎనర్జిటిక్ స్టార్ అనే పేరుకి తగ్గట్టు ఎప్పటిలానే చెలరేగిపోయాడు. సమీర్ రెడ్డి విజువల్స్ పాటను తెరమీద మరింత అందంగా చూపించాయి.