‘ఈసారి మంట మామూలూగా లేదు’.. రామ్ రఫ్ఫాడించాడుగా..

‘ఈసారి మంట మామూలూగా లేదు’.. రామ్ రఫ్ఫాడించాడుగా..

RED Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా.. ‘రెడ్’.. తమిళ్ ‘తడమ్’ మూవీకిది తెలుగు రీమేక్. కృష్ణ పోతినేని సమర్పణలో, శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. గురువారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు.

రామ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటోంది. నివేదా పేతురాజ్ పోలీస్‌గా కనిపిస్తోంది. మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సమీర్ రెడ్డి విజువల్స్, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కుదిరాయి. ప్రగతి, సత్య, సంపత్, సోనియా అగర్వాల్ కీలకపాత్రల్లో నటించారు. సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.