ఏపీలో మద్యపానంపై ఉక్కుపాదం : మద్యం దుకాణాల తగ్గింపు

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 10:46 AM IST
ఏపీలో మద్యపానంపై ఉక్కుపాదం : మద్యం దుకాణాల తగ్గింపు

ఏపీలో త్వరలోనే మద్య రహితంగా చూడనున్నామా ? అంటే ఎస్ అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే సీఎం జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు నిదర్శనం. మద్యాన్ని దశల వారీగా ఎత్తివేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. బెల్ట్ షాపులు ఎత్తివేయడం, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. మొన్ననే ఎవరూ ఊహించని విధంగా లిక్కర్ బాటిళ్ల రేట్లు పెంచిన సీఎం జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

మద్యం షాపులు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 13 శాతం వరకు మద్యం దుకాణాలను తొలగిస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. 2020, మే 09వ తేదీ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో 20 శాతం లిక్కర్ షాపులను తొలగించిన సంగతి తెలిసిందే. 4 వేల 380 మద్యం షాపులు ఉంటే…దీనిని 2 వేల 934కి తగ్గించింది. 2020, మే నెలాఖరు నాటికి షాపులు తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 43 వేల బెల్ట్ షాపులు, 40 శాతం బార్లను తగ్గించింది. 

ఏపీలో మద్యం బాటిల్ ముట్టుకోవాలంటే షాక్ తగలాలి. క్రమక్రమంగా మద్యానికి దూరం కావాలి. ఏపీ రాష్ట్రంలో భవిష్యత్ లో మద్యం పేరు వినపడకూడదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా మద్యాపానాన్ని నిరుత్సాహపరించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా మూసివేసిన మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా..మద్యం ధరలను అమాంతం పెంచేశారు. 25 శాతాన్ని పెంచిన ప్రభుత్వం..మరో 50 శాతం పెంచుతూ 200, మే 05వ తేదీ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 75 శాతం ధరలను పెంచేసినట్లైంది. 

లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ల ప్రతి బాటిల్‌పై ట్యాక్స్‌ విధించింది ఏపీ ప్రభుత్వం. పెంచిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చేశాయి. రాష్ట్రంలో మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. 

రూ. 120 బ్రాండ్ మద్యంపై క్వార్టర్ కు రూ. 40, హాఫ్ పై రూ. 80, ఫుల్ బాటిల్ పై రూ. 80 పెంచారు. 
రూ. 120 – 150 ధర ఉన్న మద్యం..క్వార్టర్ కు రూ. 80, హాఫ్ పై రూ. 160, ఫుల్ బాటిల్ పై రూ. 320 పెంచారు. 

Read More:

సారీ చెప్పిన ఎల్ జీ పాలిమర్స్ 

Lockdown 3.0 : తెలంగాణ, ఏపీలో ఆన్ లైన్ లో మద్యం ?