Jairam Ramesh: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పార్టీలు: జైరాం రమేశ్

ప్రాంతీయ పార్టీలు వైఎస్సార్టీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలని జైరాం రమేశ్ చెప్పారు. ఆయా పార్టీలకు బీజేపీతో మంచి అవగాహన ఉందని ఆరోపించారు. ఆయా ప్రాంతీయ పార్టీలు ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐలకు భయపడుతున్నాయని జైరాం రమేశ్ తెలిపారు. బీజేపీపై ఏదైనా పార్టీ పోరాడుతోందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఏఐఎంఐఎం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీ అని అన్నారు.

Jairam Ramesh: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పార్టీలు: జైరాం రమేశ్

AICC President election

Jairam Ramesh: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పార్టీలు అని, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడగలదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఇవాళ తెలంగాణలోని మెదక్ జిల్లా చుట్కూర్ నుంచి కాంగ్రెస్ నేత భారత్ జోడో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ… తాము చేస్తున్న ఈ పాదయాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం నుంచి దిగిపోవడానికి కౌంట్ డౌన్ వంటిదని చెప్పారు.

కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారులను ఆయన డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఆ రైలు మాత్రం తప్పుడు మార్గంలో వెళ్తుందని చెప్పారు. ఆ రైలును సరైన ట్రాక్ పైకి తీసుకురావడం కూడా భారత్ జోడో యాత్ర లక్ష్యాల్లో ఒకటని అన్నారు. ప్రాంతీయ పార్టీలు వైెఎస్సార్టీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలని చెప్పారు. ఆయా పార్టీలకు బీజేపీతో మంచి అవగాహన ఉందని ఆరోపించారు.

ఆయా ప్రాంతీయ పార్టీలు ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐలకు భయపడుతున్నాయని జైరాం రమేశ్ తెలిపారు. బీజేపీపై ఏదైనా పార్టీ పోరాడుతోందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఏఐఎంఐఎం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీ అని అన్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్రకు స్పందన బాగా ఉందని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..