Abdul Latif Nasser : 19ఏళ్ళ తరువాత విడుదల.. బైడెన్ నిర్ణయంతో అబ్ధుల్ లతీఫ్ జైలునుండి బయటకు

వాస్తవానికి 2016లోనే అబ్ధుల్ లతీఫ్ ను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో విడుదల ప్రక్రియ నిలిచిపోయింది.

Abdul Latif Nasser : 19ఏళ్ళ తరువాత విడుదల.. బైడెన్ నిర్ణయంతో అబ్ధుల్ లతీఫ్ జైలునుండి బయటకు

Lathif (2)

Abdul Latif Nasser : ఎలాంటి విచారణ లేకుండా ఏళ్ళ తరబడి జైళ్ళల్లో మగ్గుతున్న వారికి విముక్తి లభిస్తుంది. జైళ్ళల్లో ఉంటున్న వారి సంఖ్యను తగ్గించే క్రమంలో భాగంగా అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే సంవత్సరాలుగా జైళ్ళల్లోనే మగ్గుతూ విచారణ లేకుండా ఉన్నవారి విడుదలపై దృష్టిసారించారు. తాజాగా అబ్ధుల్ లతీఫ్ నాజీర్ ను జైలు నుండి విడుదల చేయాలని నిర్ణయించారు.

19 సంవత్సరాల క్రితం ఆఫ్ఘానిస్తాన్ లో అమెరికన్ సైన్యానికి అబ్ధుల్ లతీఫ్ పట్టుబడ్డాడు. తాలిబాన్ సభ్యుడిగా, ఆల్ ఖైదా శిక్షణ పొందాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేసి గ్వాంటనామో బే జైలులో ఉంచారు. అప్పటి నుండి ఎలాంటి విచారణ లేకుండానే లతీఫ్ జైల్లోనే కాలం వెళ్ళదీస్తున్నాడు. ఇక తనకు విడుదల ఉండదన్న నిర్ణయానికి లతీఫ్ వచ్చాడు. తన జీవితం మొత్తం జైలులోనే గడపాల్సి వస్తుందని భావించాడు.

వాస్తవానికి 2016లోనే అబ్ధుల్ లతీఫ్ ను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. బైడెన్ నిర్ణయం వల్ల 19 సంవత్సాలకు అతనికి జైలు జీవితం నుండి స్వచ్ఛలభించినట్లైంది. లతీఫ్ తరహాలోనే సత్ప్వర్తన కలిగిన వారిని జైలు నుండి విడుదల చేసేందుకు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ కసరత్తు చేస్తుంది. విడుదలైన వారిని వారి వారి స్వస్ధాలకు పంపి నిరంతర నిఘా ఉంచనున్నారు.

బైడెన్ తీసుకున్న నిర్ణయం తరువాత తొలిగా విడుదలైంది అబ్ధుల్ లతీఫ్ కావటం విశేషం. లతీఫ్ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పులేదని అన్ని కోణాల్లో దృవీకరించుకున్న తరువాతనే అతని విడుదల నిర్ణయాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించింది.