Reliance Jio Plans : జియో ప్లాన్లతో ఫ్రీగా ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్.. డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. జియో రీచార్జ్ ప్లాన్లతో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్లను ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.

Reliance Jio Plans : దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. జియో రీచార్జ్ ప్లాన్లతో ఓటీటీ సబ్ స్ర్కిప్షన్లను ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. జియో అందించే పోస్టు పెయిడ్ ప్లాన్ల ద్వారా ఈ సరికొత్త ఆఫర్లను పొందవచ్చు. అంతేకాదు.. జియో అందించే డెయిలీ డేటా బెనిఫిట్స్, ఫ్రీ కాల్స్ వంటి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే ఓటీటీ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రీపెయిడ్ ప్లాన్లు, నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఉచితంగా పొందవచ్చు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర స్ట్రీమింగ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ప్రీపెయిడ్ ప్లాన్‌ల కన్నా కొంచెం ఖరీదైనవే.. కానీ స్ట్రీమింగ్ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.
మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ ప్లాన్‌లను వేర్వేరుగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర స్ట్రీమింగ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల లిస్టు మీకోసం అందిస్తున్నాం. రూ. 399 ధరతో పోస్ట్‌పెయిడ్ చౌకైన ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ నెలకు 75GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు Netflixకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్రీ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. Amazon Prime, Disney+ హాట్‌స్టార్‌లకు ఫ్రీగా యాక్సస్ అందిస్తుంది.

Reliance Jio Postpaid Plans Offering Free Subscription
ఈ లిస్టులో నెక్స్ట్ ప్లాన్ ధర రూ. 599గా ఉండనుంది. ఈ ప్లాన్ 100GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. సాధారణ బెనిఫిట్స్‌తో పాటు.. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఫ్రీగా యాక్సెస్‌ను అందిస్తుంది. రూ. 799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా 150GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్, SMS, 200GB డేటా రోల్‌ఓవర్, ఫ్యామిలీ ప్లాన్‌తో పాటు 2 అదనంగా SIM కార్డ్‌లను పొందవచ్చు.
కాలింగ్, ఇంటర్నెట్ బెనిఫిట్స్ పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అలాగే డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు. అంతేకాదు.. రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ 200GB డేటాను అందిస్తుంది. ఫ్యామిలీ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్, SMS, 3 SIM కార్డ్‌లను కూడా అందిస్తారు. ఈ ప్లాన్ 500GB డేటా రోల్‌ఓవర్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అలాగే డిస్నీ+ హాట్‌స్టార్‌లకు ఉచితంగా యాక్సెస్‌ను అందిస్తుంది.
Read Also : Jio vs Vi vs Airtel : జియో టు ఎయిర్‌టెల్.. రోజుకు 3GB డేటా.. టాప్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!