ration card : 3 నెలలు వరుసగా బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తొలగింపు

రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 3 నెలలు వరుసగా బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

ration card : 3 నెలలు వరుసగా బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తొలగింపు

Ration Card Ts

Removal of ration card : రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 3 నెలలు వరుసగా బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ..కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. రేషన్ కార్డు విషయంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆంక్షలు పెట్టిందన్నారు. 53.46 లక్షలకు మాత్రమే అర్హులు అని చెప్పిందని తెలిపారు.

తెలంగాణలో 1.79 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2.79 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న జనాభాలో 80 శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాక 3.59 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు.

97 వేల కొత్త రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వల్లనే కొత్త కార్డులు ఆగిపోయాయని తెలిపారు. ఇప్పటివరకు తెల్లరేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.