Renault : రూ.80వేల వరకు డిస్కౌంట్స్.. కార్ల కొనుగోలుపై రెనాల్ట్ అదిరిపోయే ఆఫర్స్

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేశారా? భారీగా డిస్కౌంట్ ఆశిస్తున్నారా? మీలాంటి వారి కోసం కార్ల కంపెనీ రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

Renault : రూ.80వేల వరకు డిస్కౌంట్స్.. కార్ల కొనుగోలుపై రెనాల్ట్ అదిరిపోయే ఆఫర్స్

Renault

Renault : మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేశారా? భారీగా డిస్కౌంట్ ఆశిస్తున్నారా? మీలాంటి వారి కోసం కార్ల కంపెనీ రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

ఫ్రాన్స్‌కు చెందిన మల్టీనేషనల్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్ట్‌ ఇండియా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రెనాల్ట్‌ శ్రేణిలోని కార్ల కొనుగోలుపై బంపర్‌ ఆఫర్లు అనౌన్స్ చేసింది. రెనాల్ట్ ఇండియా తన మోడల్ లైనప్‌లో పలు ప్రయోజనాలను ప్రకటించింది. రెనాల్ట్‌ సుమారు రూ.80 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్స్‌, లాయల్టీ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్లను అందించనుంది. ఈ ఆఫర్స్‌ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి.

SBI Warning : ఆ నంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు SBI హెచ్చరిక

మోడల్, ప్రాంతాలను బట్టి ఈ ఆఫర్స్ మారుతాయి. ‘బై నౌ, పే ఇన్‌ 2022’ అనే సరికొత్త స్కీమ్‌తో రెనాల్ట్‌ ముందుకొచ్చింది. ఈ స్కీమ్‌ సెలక్టెడ్‌ కార్లపై మాత్రమే. అంతేకాదు ఈ స్కీమ్‌లో భాగంగా తొలి ఆరు నెలల సమయంలో ఈఎమ్‌ఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కారు కొన్న వెంటనే ఈఎమ్‌ఐ చెల్లించనక్కర్లేదు. రెనాల్ట్ తన RELi.VE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద సుమారు రూ. 10 వేల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ క్విడ్, ట్రైబర్ లేదా డస్టర్‌పై వర్తిస్తుంది.

రెనాల్ట్‌ ట్రైబర్‌
ట్రైబర్ ఎమ్‌పీవీపై రెనాల్ట్‌ విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది. రెనో 2020 మోడల్ ట్రైబర్‌పై కొనుగోలుదారులు సుమారు రూ.60 వేల వరకు ప్రయోజనాలను పొందొచ్చు. వీటిలో రూ. 25 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్‌, రూ.25 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి. 2021 మోడల్ ఇయర్ ట్రైబర్ కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ.50 వేల వరకు ప్రయోజనాలను పొందుతారు. వీటిలో రూ.15 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్‌, రూ.25 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

రెనాల్ట్ డస్టర్
రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై సుమారు రూ. 80 వేల వరకు బెనిఫిట్స్‌ అందిస్తోంది. వీటిలో రూ.30 వేల వరకు క్యాష్‌ బెనిఫిట్‌, రూ.20 వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ. 30వేల వరకు కార్పొరేట్ బోనస్‌ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లకు ‘ఇప్పుడు కొనండి 2022లో చెల్లించండి’ స్కీమ్‌ వర్తించనుంది.

రెనాల్ట్‌ క్విడ్‌
క్విడ్ హ్యాచ్‌బ్యాక్ సేల్‌లో రూ.40 వేల వరకు గరిష్ట ప్రయోజనాలతో అమ్మకానికి ఉంది. ఈ ఆఫర్‌లలో రూ.10వేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, 10వేల వరకు కార్పొరేట్‌ బోనస్‌ ఉన్నాయి.