Food : మిగిలిపోయిన ఆహారపదార్ధాలను పదేపదే వేడిచేస్తున్నారా… అయితే జాగ్రత్త…

అలాగే మిగిలిపోయిన అన్నం విషయంలోను చాలా మంది ఇలాగే చేస్తుంటారు. ఉదయం వండిన అన్నం మిగిలిపోతే రాత్రికి తిరిగి వేడి చేసుకుని తినటం కొంతమందికి అలవాటు.

10TV Telugu News

Food : ఇంట్లో, బయట హోటల్స్ లో మిగిలిపోయిన ఆహార పదార్ధాలను ఫ్రిజ్ లలో నిల్వఉంచటం ఇటీవలికాలంలో చాలా మందికి ఫ్యాషనై పోయింది. ఎక్కవ మొత్తంలో తయారు చేసుకున్న ఆహారాన్ని తిన్నంత తినగా మిగిలిపోయిన వాటిని చెత్తకుప్పలో పారేయటం చాలా మందికి ఇష్టం ఉండదు. అవి ఎక్కడ వేస్ట్ అవుతాయోనని వాటిని ఫ్రిజ్ లో భద్రపరుచుకుని తినటం అందరికి అలవాటైపోయింది.  తినాలనుకున్నప్పుడు వాటిని తిరిగి వేడి చేసుకుని తినేస్తుంటారు. ఇలా తినటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని చాలా మందికి తెలియదు. ఇలా చేస్తున్న వారి పట్ల ప్రస్తుతం ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా తినటం వల్ల ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవ్వటంతోపాటు, దీర్షకాలిక సమస్యలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆకుపచ్చని కూరగాయలతోపాటు, పాలకూర వంటికి వంటలను సిద్ధం చేసుకున్న తరువాత అవి మిగిలిపోతే ఫ్రిజ్ లో భద్రపరిచి తిరిగి వాటిని తినేముందు వేడి చేసుకుని తినటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

ఆకు కూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఎక్కవగా ఉన్న ఆకు కూరను పదే పదే వేడిచేయటం వల్ల అదికాస్తా ఆక్సైడ్ గా మారుతుంది. ఐరన్ ఆక్సీకరణ చెందటం వల్ల ఎన్నో ఆనారోగ్యసమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మిగిలిపోయిన అన్నం విషయంలోను చాలా మంది ఇలాగే చేస్తుంటారు. ఉదయం వండిన అన్నం మిగిలిపోతే రాత్రికి తిరిగి వేడి చేసుకుని తినటం కొంతమందికి అలవాటు. అన్నం విషయానికి వస్తే వండిన రెండు గంటల వ్యవధి తరువాత బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఎక్కవ సమయం నిల్వ ఉన్న అన్నాన్ని తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ గా మారి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

చాలా మంది కోడి గుడ్లను ఒకేసారి ఉడకబెట్టుకుని ఫ్రిడ్జ్ లో నిల్వవుంచుకుని తినటం అలవాటు.ఉడకబెట్టిన గుడ్డును రెండు గంటల లోపు తినటం మంచింది. ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్ లో ఉంచి తినే ముందు తిరిగి వేడి చేసుకుని తినటం వల్ల జీర్ణపరమైన సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చికెన్ కూడా పదే పదే వేడిచేయటం, వేపటం వంటి చేయటం ఆరోగ్యానికి చేయటం తోపాటు పలు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు హెచ్చుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను వేడి చేసుకుని తినకుండా ఉండటమే ఉత్తమం.

10TV Telugu News