Republic Day : అదిరిన ఫినిషింగ్ టచ్.. అదరహో అనిపించిన త్రివిధ దళాలు

ఫినిషింగ్‌ టచ్‌ అదిరింది. త్రివిధ దళాలు అదరహో అనిపించాయి. ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. త్రిశూల్ ఫార్మేషన్‌లో జెట్ విమానాలు దూసుకెళ్లాయి. గంటకు 900 కిలోమీటర్ల...

Republic Day : అదిరిన ఫినిషింగ్ టచ్.. అదరహో అనిపించిన త్రివిధ దళాలు

Republic Day 2022

Republic Day Highlights 2022 : ఫినిషింగ్‌ టచ్‌ అదిరింది. త్రివిధ దళాలు అదరహో అనిపించాయి. ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. త్రిశూల్ ఫార్మేషన్‌లో జెట్ విమానాలు దూసుకెళ్లాయి. గంటకు 900 కిలోమీటర్ల వేగంతో జెట్‌ విమానాలు ప్రయాణించాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా.. ముందుగా ఉదయం అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు ఆర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్ల కోసం మోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల పుస్తకంలో మోదీ సంతకం చేశారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు. ఇండియా గేటు వద్ద ప్రధాని నేతాజీ డిజిటల్ విగ్రహం తెరను ప్రారంభించి రిపబ్లిక్ వేడుకలను ప్రారంభించారు. దేశంలో కోసం ప్రాణాలు అర్పించిన 25 వేల 942 మంది అమర సైనికుల పేర్లను వార్ మెమోరియల్ వద్ద గ్రానైట్‌పై చెక్కారు.

Read More : TTD : గో ఆధారిత ఉత్పత్తులు.. మొత్తం 15 రకాలు

ఆ తర్వాత రాజ్‌ప‌థ్‌కు చేరుకున్నారు మోదీ. అక్కడ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం 155 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు హెలికాప్టర్లు వైన్ గ్లాస్ ఫార్మేష‌న్‌ను ప్రద‌ర్శించారు. అనంత‌రం వివిధ బ‌ల‌గాల మార్చ్‌ఫాస్ట్ జ‌రిగింది. ఆ త‌ర్వాత శ‌క‌టాల ప్రద‌ర్శన మొద‌లైంది. ఈ ప్రద‌ర్శన‌ల్లో భార‌త ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ శ‌క‌టాలు ఆక‌ట్టుకున్నాయి. ఆర్మీ శ‌క‌టాల్లో సెంచూరియ‌న్ ట్యాంక్‌, పీటీ-76, ఎంబీటీ అర్జున్ ఎంకే-1, టోపాజ్ యుద్ధ ట్యాంకుల‌ను, స్వదేశీ ప‌రిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హ‌విట్జర్ ఎంకే-1 గ‌న్ సిస్టమ్‌ను ప్రద‌ర్శించారు. ఇండియ‌న్ నేవీ శ‌క‌టంలో నేవీకి చెందిన వివిధ సామ‌ర్థ్యాల‌ను తెలియ‌జేసే న‌మూనాల‌ను ప్రద‌ర్శన‌కు పెట్టారు. ఆ త‌ర్వాత ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ శ‌క‌టం ప‌రేడ్‌లోకి వ‌చ్చింది. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఫ‌ర్ ది ఫ్యూచర్ అనే థీమ్‌ను ఈ శ‌క‌టం ప్రద‌ర్శించింది. ఈ శ‌క‌టంపై మింగ్‌-21, గ్నాట్‌, లైట్ కంబాట్ హెలికాప్టర్‌, అశ్లేష రాడార్‌, రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ న‌మూనాల‌ను ప్రద‌ర్శించారు. శకటాల ప్రదర్శన తర్వాత విమానాల ప్రదర్శన అదరహో అనిపించింది. వివిధ ఆకారాలతో కనువిందు చేశాయి. దీంతో ఢిల్లీలో గణతంత్రం వేడుకలు ముగిశాయి. వేడుకల తర్వాత తిరిగి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లిపోయారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.