COVID-19 Duty : వైద్యుల కొవిడ్ డ్యూటీ 8 గంటలకు మించరాదు.. కేంద్ర, రాష్ట్రాలకు IMA కీలక సూచనలు

దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

COVID-19 Duty : వైద్యుల కొవిడ్ డ్యూటీ 8 గంటలకు మించరాదు.. కేంద్ర, రాష్ట్రాలకు IMA కీలక సూచనలు

Resident Doctors’ Covid 19 Duty Should Not Exceed 8 Hours And 7 Days

COVID-19 Duty : దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Cases) కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా కొవిడ్ విధుల్లో పనిచేస్తుంటారు వైద్యులు. ఈ నేపథ్యంలో వైద్యుల రక్షణపై కేంద్ర, రాష్ట్రాలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ (IMA) కీలక సూచనలు చేసింది. రెసిడెంట్​ డాక్టర్లకు కొవిడ్​ డ్యూటీ 8 గంటలకు మించకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎంఏ కోరింది.

వారం రోజుల పాటు విధులు నిర్వర్తించిన రెసిడెంట్​ డాక్టర్లను 10-14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని సూచించింది. రెసిడెంట్​ డాక్టర్లు పని చేసే ఆసుపత్రుల్లోనే ఆయా వైద్యులకు వసతులు కల్పించాలని సూచించింది. కొవిడ్​ విధులు నిర్వర్తిస్తూ.. వైద్యులు అనారోగ్యానికి గురైతే వీలైనంత త్వరగా వారికి చికిత్స అందించాలని ఐఎంఏ సూచించింది. డాక్టర్ల విధి నిర్వహణలో వైద్యులు మరణిస్తే.. వారి మరణ ధ్రువీకరణ, పరిహారం వంటివి త్వరగా అందించాలని కోరింది. కొవిడ్​ రెండో దశలో సుమారు 2వేల మంది  వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ ప్రజల్లో మరణాల రేటు 1.5 శాతం ఉంటే ఆరోగ్య, సిబ్బందిలో 2-3 శాతం మేర ఉంది. ఇప్పటికే లక్ష మంది వైద్యులు కరోనా బారిన పడినట్టు ఐఎంఏ పేర్కొంది.

కరోనా మూడోవేవ్​లో మరణాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ తెలిపింది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్​ వైరస్ 5.4 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్​ వార్డుల్లో పనిచేసే వైద్యులకే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొవిడ్ బాధితుల కోసం ముందుండి విధులు నిర్వర్తించే వైద్యులు 5నుంచి 10 రెట్లు వైరస్ బారినపడే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో అతిపెద్ద వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారని IMA పేర్కొంది.

వైద్యుల కొరతతో ఆరోగ్య విభాగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపింది. ఇకపై అలాంటి సమస్య తలెత్తకుండా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని IMA సూచించింది. వైద్య కళాశాలల సమన్వయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్​ కట్టడికి చర్యలు చేపట్టాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ సూచనలు చేసింది.

Read Also : Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు