AAP on Prez poll: ద్రౌపది ముర్ముపై గౌరవం ఉన్నా.. యశ్వంత్‌కే మా ఓటు: ఆప్

ఈ అంశంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించారు.

AAP on Prez poll: ద్రౌపది ముర్ముపై గౌరవం ఉన్నా.. యశ్వంత్‌కే మా ఓటు: ఆప్

Aap On Prez Poll

AAP on Prez poll: రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే ఉంటుందని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ‘ఆప్’ తమ మద్దతు ఎవరికి అనే విషయం ప్రకటించలేదు.

Monkeypox: మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ఈ అంశంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయనున్న పార్టీల్లో ‘ఆప్’ కూడా చేరింది. ఈ అంశంపై పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే తమకు గౌరవం ఉందని, అయితే ఓటు మాత్రం యశ్వంత్ సిన్హాకే వేస్తామని ఆయన చెప్పారు. ఎన్డీయే అభ్యర్థికి అనుకూలంగా బిజూ జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, శిరోమణి అకాళీదల్, ఏఐఏడీఎమ్‌కేతోపాటు టీడీపీ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి.

Inflation: ద్రవ్యోల్బణం.. తెలంగాణలోనే ఎక్కువ

ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎమ్‌సీ, సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, ఏఐఎమ్ఐఎమ్, ఆర్‌జేడీ, ఏఐయూడీఎఫ్, ఆప్ మద్దతు ప్రకటించాయి. మొన్నటివరకు ప్రతిపక్షంలో ఉన్న జేఎమ్ఎమ్, టీడీపీ, శివసేన తాజాగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వడం విశేషం.