Revanth Reddy: పీవీ సంస్కరణల వల్లే భారత్ శక్తివంతం: రేవంత్ రెడ్డి

భూ సంస్కరణలు తెచ్చి, భూమిలేని పేదలకు భూమి ఇచ్చింది పీవీ. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే పీవీ సరళీకృత ఆర్థిక విధానాలే కారణం. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన కృషి మరువలేనిది.

Revanth Reddy: పీవీ సంస్కరణల వల్లే భారత్ శక్తివంతం: రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy: భారత్ ఆర్థికంగా శక్తివంతంగా ఎదగడానికి పీవీ నరసింహా రావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.

P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’

‘‘భూ సంస్కరణలు తెచ్చి, భూమిలేని పేదలకు భూమి ఇచ్చింది పీవీ. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే పీవీ సరళీకృత ఆర్థిక విధానాలే కారణం. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన కృషి మరువలేనిది. పీవీ స్వగ్రామం వంగరలో పీవీ జ్ఞాపకార్థం చేపట్టిన పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పీవీ చూపిన బాటలో కాంగ్రెస్ నేతలు నడుస్తారు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై కూడా రేవంత్ స్పందించారు.

Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని

‘‘కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం లేదు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ హాజరయ్యేవారు. ఎన్డీయే అభ్యర్థికి మెజారిటీ ఉందని తెలిసే, బీజేపీ అనుమతి తీసుకుని ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రాష్ట్రాల పర్యటన చేసి, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కూడగట్టాలి. బీజేపీకి టీఆర్ఎస్ వ్యతిరేకం అయితే.. అగ్నిపథ్ విషయంలో నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలి. రాజకీయ పర్యటనకు వస్తున్న మోదీని నిరసనలతో కేసీఆర్ అడ్డుకోవాలి. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కలిసే ప్రసక్తే లేదు’’ అని రేవంత్ అన్నారు.