RGV Biopic: మరోసారి తెరమీదకొచ్చిన వర్మ బయోపిక్!

ఇండియన్ సినిమా పరిశ్రమలో బయోపిక్స్ జమానా నడుస్తున్న సంగతి తెలిసిందే. నటులు, క్రీడా కారులు, రాజకీయ నేతలు ఇలా ఎవరి జీవితమైనా కథాంశంగా మలచి ప్రేక్షకులను ఎంగేజ్ చేసి అలరిస్తున్నారు. ఇది ఒక్కోసారి పల్టీ కొట్టినా బయోపిక్స్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

RGV Biopic: మరోసారి తెరమీదకొచ్చిన వర్మ బయోపిక్!

Rgv Biopic

RGV Biopic: ఇండియన్ సినిమా పరిశ్రమలో బయోపిక్స్ జమానా నడుస్తున్న సంగతి తెలిసిందే. నటులు, క్రీడా కారులు, రాజకీయ నేతలు ఇలా ఎవరి జీవితమైనా కథాంశంగా మలచి ప్రేక్షకులను ఎంగేజ్ చేసి అలరిస్తున్నారు. ఇది ఒక్కోసారి పల్టీ కొట్టినా బయోపిక్స్ కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. నిజ జీవిత కథలను ఇష్టమొచ్చినట్లుగా రాసుకొని సినిమాలు తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇండియన్ లెజెండరీ సినిమాలతో పాటు అడల్ట్ సినిమాలలో కూడా నేనే టాప్ అని నిరూపించుకున్న దర్శకుడు కూడా వర్మనే. వర్మ మాట్లాడినా సెన్సేషనే.. సినిమా తీసినా సెన్సేషనే. ఇక అయన చెప్పే వేదాంతాలు.. ఫిలాసఫీలైతే అబ్బో ఆయన అభిమానులకు ఆ కిక్కే వేరు.

మరి ఇలాంటి వైవిధ్యమైన క్యారక్టరైజేషన్ ఉన్న వర్మ జీవితాన్ని కథగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది. నిజానికి ఇదే ఉద్దేశ్యంతోనే వర్మ బయోపిక్ కు ఎప్పుడో ముహూర్తం పెట్టారు. స్వయంగా ఆర్జీవీ సోదరి శ్రీమతి విజయనే క్లాప్ కొట్టి వర్మ బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టారు. మొత్తం ఆరు గంటల ఈ సినిమాని 3 భాగాలుగా విడుదల చేస్తామని అప్పుడు సినిమా యూనిట్ ప్రకటించింది. ఏమైందో ఏమో కానీ ఆ సినిమాపై మళ్ళీ ఎలాంటి ఊసే లేదు. కానీ ఇప్పుడు మరోసారి వర్మ బయోపిక్ అంశం తెరమీదకి వచ్చింది.

తాజాగా వర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించాడు. దానికి వర్మ కూడా నా జీవితం తెరపై చాలా బోర్ కొడుతుంది. నా లైఫ్ లో సినిమాకు కావాల్సినన్ని మలుపులు ఆసక్తికరమైన విషయం ఏదీ లేదని కొట్టి పారేశారు. వివాదాలు, టాలెంట్, ఫన్ అండ్ ఫ్రస్టేషన్, ఆయన మాటల్లో ఫిలాసఫీ, సైకాలజీ మీద ఆయన లెక్చర్లు, దెయ్యాలు భూతాలు అంటే భయం, అండర్ వరల్డ్ లింకులు.. ఇలా ఆయన జీవితంలో ఉన్నన్ని ట్విస్టులు, మలుపులు ఇంకెవరి జీవితంలో ఉంటాయి. కనుక వర్మ కథతో బయోపిక్ తీస్తే సక్సెస్ ఖాయమని సోషల్ మీడియా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇది చూసిన దర్శక, నిర్మాతలు ఎవరైనా వర్మ జీవితాన్ని తెరమీదకి తెస్తారేమో చూడాలి!

Read: Allu Arjun Pushpa: తగ్గేదే లే.. యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.40 కోట్లు!