RGV Deyyam: రామ్ గోపాల్ వర్మ ఈసారైనా భయపెడతాడా?

రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. మూసబాటలో వెళ్లే తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పిన ఒక దర్శకుడు. కానీ ఈ మధ్య ట్రెండ్ సెట్టర్ దర్శకుడు కాస్త కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా.. వర్మ ఈసారి మళ్ళీ రూటు మార్చి మరోసారి దెయ్యం కథతో పాపులర్ నటులతో సినిమా చేశాడు.

RGV Deyyam: రామ్ గోపాల్ వర్మ ఈసారైనా భయపెడతాడా?

Rgv Deyyam

RGV Deyyam: రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. మూసబాటలో వెళ్లే తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పిన ఒక దర్శకుడు. కానీ అంతా నా ఇష్టం అనే వర్మ ప్రేక్షకులను భయపెట్టాలని.. తన మార్క్ పబ్లిసిటీతో సినిమాను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఈ మధ్య ట్రెండ్ సెట్టర్ దర్శకుడు కాస్త కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా.. కరోనా లాక్ డౌన్ లో ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ మోడ్ లో ఉంటె ఆర్జీవీ మాత్రం వరస సినిమాలను రిలీజ్ చేస్తూ తన మార్క్ ఐడెంటిటీని చూపించాడు. వాటి రిజల్ట్ ఎలా ఉన్నా కాసులు మాత్రం బాగానే దండుకున్నాడని పేరొచ్చింది.

పోర్న్ స్టార్స్ నుండి.. ఏ మాత్రం మార్కెట్ లేని మోడల్స్ వరకు తన సినిమా కోసం తెరమీదకి తీసుకొచ్చే వర్మ ఈసారి మళ్ళీ రూటు మార్చి మరోసారి దెయ్యం కథతో పాపులర్ నటులతో సినిమా చేశాడు. గతంలో ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ వంటి చిత్రాలతో ఇండియన్ ఆడియెన్స్ కు హర్రర్ చిత్రాలను పరిచయం చేసిన వర్మ మళ్ళీ చాలా కాలం తర్వాత దెయ్యాన్ని నమ్ముకొని సినిమా చేశాడు. ఈ సినిమాలో సినియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా.. రాజశేఖర్ కూతురుగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ నటించింది.

అంతేకాదు.. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి వారితో ఫుల్ ప్యాక్డ్ మూవీగా చేశాడు. ఈ సినిమాను వర్మ ఎప్పుడు షూట్ చేశాడో ఏమో కానీ ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమా చూసే ప్రేక్షకులు భయపడుతూనే తప్పకుండ ఎంజాయ్ చేస్తారని వర్మ ఈసారి ధీమాగా చెప్తున్నాడు. మరి నిజంగానే వర్మ ఈసారి ప్రేక్షకులను భయపెట్టి థ్రిల్ చేస్తాడా? లేక ఎప్పటిలాగానే పబ్లిసిటీకి మాత్రమే పరిమితమవుతాడా అన్నది చూద్దాం!