RGV : పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ.. లడికి సినిమా వివాదంపై స్పందించిన ఆర్జీవీ..

తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లి శేఖర్ రాజు, ఎన్.రవి కుమార్ రెడ్డి మీద ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ''నేను నిర్మించిన సినిమా లడికి ఈ నెల 15 రిలీజ్ అయింది. దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి..........

RGV : పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ.. లడికి సినిమా వివాదంపై స్పందించిన ఆర్జీవీ..

Ladki

Ladki Movie :  ఇటీవల ఆర్జీవీ దర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో లడికి అనే సినిమా వచ్చింది. తెలుగులో అమ్మాయిగా రిలీజ్ అయింది. బ్రూస్లీ నేపథ్యంలో తీయడంతో చైనాలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఆర్జీవీ లడికి సినిమాని ఆపాలంటూ శేఖర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి స్టే తెచ్చుకున్నాడు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ వివాదంపై ఆర్జీవీ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో.. ”లడికి సినిమా స్క్రీనింగ్ ఆపు చేయాలి అని ఇద్దరు దొంగ కాగితాలతో అబద్ధపు స్టేట్మెంట్లతో ఫోర్జరీ సంతకాలతో కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చారు. కానీ కోర్టులో ఆ ఇద్దరి స్టేలని కొట్టివేసి నా లడికి సినిమాకి క్లియరెన్స్ ఇచ్చారు. నా సినిమాని ఇబ్బంది పెట్టాలని చూసిన వారిపై చట్టరీత్యా అనేక సెక్షన్ల కింద చర్య తీసుకోబోతున్నాను. నా కంపెనీ లెటర్ హెడ్ ని ఫోర్జరీ చేసిన ఎన్.రవి కుమార్ రెడ్డి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ చేయడమే కాకుండా రన్నింగ్ లో ఉన్న నా సినిమాను ఆపినందుకు పరువు నష్టం మరియు నాకు జరిగిన నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా వసూలు చేస్తాను. నేనే కాకుండా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆస్ట్రీ మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ కూడా ఆ ఇద్దరి మీద కేసులు పెట్టబోతున్నారు. ఇక శేఖర్ రాజ్ అనే వ్యక్తి కోర్టులో అబద్ధపు స్టేట్మెంట్లతో కోర్టు వారిని మభ్య పెట్టిన విషయంలో అదే కోర్టులో ఫోర్జరీ నేరం కింద కంప్లైంట్ నమోదు చేయబోతున్నాము” అని తెలిపారు.

Mythri Movie Makers : సల్మాన్ ఖాన్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా.. టాలీవుడ్ నిర్మాతలతో??

 

తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లి శేఖర్ రాజు, ఎన్.రవి కుమార్ రెడ్డి మీద ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ”నేను నిర్మించిన సినిమా లడికి ఈ నెల 15 రిలీజ్ అయింది. దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి స్టే తెచ్చారు. సినిమా ఆగిపోయింది. హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు నాపై ఆలిగేషన్ పెట్టారు. కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడు, తప్పుడు పత్రలను సృష్టించి కోర్టులో కేసు వేశారు, దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించాను. ఇదొక ఆనవాయితీగా గా మారుతోంది. సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్. ఇలాంటివి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టాను. ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది వారందరూ శేఖర్ రాజుపై కేసులు పెడతారు. చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నాం. శేఖర్ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుందాం అనే భావనతో శేఖర్ ఇదంతా చేస్తున్నారు” అని తెలిపాడు.