RGV : అందుకే రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ చేశాడు.. అదిరిపోయిన ఆర్జీవీ ట్వీట్..

రణవీర్ న్యూడ్ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ''నాకు తెలిసి లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్‌వీర్‌ ఇలా ఫొటోషూట్‌ చేసి ఉంటాడు. మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది, పురుషులు చూపిస్తే తప్పా........

RGV : అందుకే రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ చేశాడు.. అదిరిపోయిన ఆర్జీవీ ట్వీట్..

RGV :  ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కొంత మంది దీనిని వ్యతిరేకిస్తుంటే, మరికొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో నేను ఉన్నాను అంటూ తలదూర్చే ఆర్జీవీ తాజాగా రణవీర్ న్యూడ్ ఫొటోషూట్ పై కూడా కామెంట్స్ చేశాడు.

Ranveer Singh : న్యూడ్ ఫోటోషూట్ చేసినందుకు రణవీర్ పై పోలీసు కేసు..

రణవీర్ న్యూడ్ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ”నాకు తెలిసి లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్‌వీర్‌ ఇలా ఫొటోషూట్‌ చేసి ఉంటాడు. మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది, పురుషులు చూపిస్తే తప్పా?. మహిళలతో సమానంగా మగవారికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల కోసమే రణవీర్ ఇలా చేశాడు” అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ. అంతేకాకుండా మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే కూడా అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్‌ క్వశ్చన్‌ కూడా పెట్టాడు ఆర్జీవీ. దీంతో ఈ ట్వీట్ మరింత వైరల్ గా మారింది. వీటితో పాటు మరిన్ని ఫోటోలు షేర్ చేసి రణవీర్ కి సపోర్ట్ చేస్తూ మరిన్ని ట్వీట్స్ పెట్టాడు ఆర్జీవీ.