Rishab Vs Rashmika : రిషబ్ వర్సెస్ రష్మిక.. అసలు ఈ గొడవేంటి??

రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి..ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్లైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది..............

Rishab Vs Rashmika : రిషబ్ వర్సెస్ రష్మిక.. అసలు ఈ గొడవేంటి??

Rishab Shetty Vs Rashmika Mandanna Issue goes viral

Rishab Vs Rashmika :  రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి..ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్లైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అసలు ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా చెయ్యని రష్మికకి, రిషబ్ కి మధ్య గొడవేంటి అని అంత ఆచర్చించుకుంటున్నారు.

రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార కన్నడలో మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ సాధించి 400కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాని సౌత్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా చూసి ఆహా, ఓహో అని మెచ్చుకున్నారు. కానీ కన్నడ సినిమాకు చెందిన రష్మిక మాత్రం సినిమా చూడలేదని, ఇంకా టైమ్ దొరకలేదని చెప్పింది. దాంతో ఫుల్ ట్రోలింగ్ ఫేస్ చేసింది రష్మిక. అయితే కాంతారా సినిమా చూడడానికి అసలు రష్మికకి ఇష్టమే లేదని, రిషబ్ తో సరిగా సంబంధాలు లేవని, ఇద్దరి మద్య కోల్డ్ వార్ జరుగుతోందని లేటెస్ట్ గా వీరిద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూలతో బయటపడింది.

కాంతారా సినిమాకి హీరో, కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి ఫస్ట్ డైరెక్టర్ గానే కెరీర్ స్టార్ట్ చేశారు. రష్మిక, రక్షిత్ శెట్టి కాంబినేషన్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కిరాక్ పార్టీ మూవీ చేశారు రిషబ్. రక్షిత్ – రిషబ్ ఇద్దరూ అంతకుముందు నుంచే మంచి ఫ్రెండ్స్. రష్మికకి మొదట ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టినే. అయితే రష్మిక ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూ లో తన ఫస్ట్ మూవీ చాన్స్ గురించి చెబుతూ తన ఫోటో చూసి ఓ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కాల్ వచ్చిందని చెప్పిందే కానీ రిషబ్ శెట్టి గురించి ఒక్క మాటే చెప్పలేదు. దాంతో రిషబ్ శెట్టి కూడా తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో రష్మిక లాంటి వాళ్లతో పని చెయ్యదలచుకోవడానికి ఇష్టపడడం లేదని రష్మిక సిగ్నేచర్ హ్యాండ్స్ ని ఇమిటేట్ చేస్తూ ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Mamta Mohandas : క్యాన్సర్ వస్తే ఇలా ఉంటానా.. ఫేక్ వార్తలకి గట్టింగా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

రిషబ్ ని సాయిపల్లవి, సమంత, రష్మికలలో ఎవరితో కలిసి పనిచేయాలి అనుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో అడగగా సమంత, సాయిపల్లవి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ తోనే వర్క్ చెయ్యాలనుకుంటున్నానని చెప్పారు రిషబ్. రష్మికని ఇమిటేట్ చేసిన రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరో వైపు ఇప్పటి వరకూ కాంతారా సినిమా చూడలేదని రష్మిక హాట్ టాపిక్ అయ్యారు. ఇలా వీళ్లిద్దరి కోల్డ్ వార్ ఇటు సౌత్ నుంచి బాలీవుడ్ వరకూ టాక్ ఆఫ ద టౌన్ గా మారింది. గతంలో రక్షిత్ కి, రష్మికకి ఎంగేజ్మెంట్ జరిగి క్యాన్సిల్ అయిందని అందరికి తెలిసిందే. రక్షిత్, రిషబ్ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో అప్పట్నుంచే వీరిద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తుంది.