Road accident : రెండు బైకులు ఢీ..ముగ్గురు యువకులు మృతి

ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుడు మృతి చెందారు.

Road accident : రెండు బైకులు ఢీ..ముగ్గురు యువకులు మృతి

Road Accident In Telangana

Road accident Three Died in adilabad : ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద శ‌నివారం (డిసెంబర్ 25,2021) తెల్ల‌వారుజామున రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌కు చెందిన ఇద్దరు చనిపోయారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన యువకుడు మృతిచెందాడు. త‌డిహ‌త్నూర్‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కులు, పెరికగూడ‌కు చెందిన మ‌రో యువ‌కుడు ముగ్గురు ఒకే బైక్ పై వెళ్తున్నారు.

కుమ్మ‌రితండా వ‌ద్ద‌కు చేరుకునేస‌రికి ఎదురుగా వ‌చ్చిన మ‌రో బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌డిహ‌త్నూర్‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయ‌ప‌డిన మరో యువకుడిని చికిత్స కోసం రిమ్స్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా..పెరిక‌గూడ‌కు చెందిన యువ‌కుడు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మృతి చెందాడు.

కాగా భారత్ లో రోడ్డు ప్రమాదాలు జరుగని రోజు అంటూ లేదు. నిర్లక్ష్యం..ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం..డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా కారణం ఏదైనా ప్రమాదాలల్లో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదాలు నెలకొంటున్నాయి. తెలంగాణాలో రాజధాని హైదరాబాద్ నగరం రోడ్డు ప్రమాదాల విషయంలో మొదటి స్థానంలో ఉండగా, ఖమ్మం, వరంగల్ జిల్లాలు మూడు, నాలుగు స్థానాలలో ఉన్నాయి. గత ఐదేళ్ళ నుంచి జిల్లాలో సగటున ఏడాదికి 2వేల నుంచి 2500 వరకు ప్రమాదాలు జరుగుతుండగా… 2020-21లో 3 వేలకు పైగా ప్రమాదాలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక్క చోట రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఎందరో గాయపడి హాస్పిటల్స్ లో చేరుతూ కుటుంబాలకు కన్నీటిని మిగులుస్తున్నారు.