Asha Kandra : రోడ్లు ఊడ్చే స్వీపర్..నేడు డిప్యూటీ కలెక్టర్

అనుకున్నదే తడవుగా ఒకవైపు స్వీపర్ గా రోడ్లు ఊడ్చే ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదువుకుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసింది.

Asha Kandra : రోడ్లు ఊడ్చే స్వీపర్..నేడు డిప్యూటీ కలెక్టర్

రోడ్లు ఊడ్చే స్వీపర్ డిప్యూటీ కలెక్టర్

Asha Kandra : కృషి, పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఈ విషయం అనేక మార్లు పలువురి జీవితాల్లో నిరూపితమైంది. చాలా మంది ఎన్నో కష్టాలు, బాధలు పడుతుంటారు. వాటి నుండి బయటపడేందుకు సన్నిహితులో, బంధువులో అదుకోవాలని ఆకాక్షింస్తుంటారు. కాని వాటి నుండి తమకుతాముగా బయటపడేంతుకు ఏమాత్రం ప్రయత్నం చేయరు. అయితే రాజాస్ధాన్ లోని ఓ మహిళ కష్టాల నుండి గట్టెక్కాలన్న పట్టుదలతో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించింది. స్వీపర్ స్ధాయి నుండి ఉన్నత ఉద్యోగి స్ధాయికి ఆమె ఎదిగిన క్రమం అందరినీ ఆశ్ఛర్యపోయేలా చేసింది. ఇక వివరాల్లోకి వెళితే..

రాజస్ధాన్ లోని జోధ్ పూర్ కు చెందిన ఆశ ఎనిమిది సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది. తన ఇద్దరు పిల్లలను పెంచే బాధ్యతను తీసుకున్న ఆమె జోధ్ పూర్ మున్సిపల్ కార్పోరేషన్ లో మహిళా స్వీపర్ గా చేరింది. ఉదయాన్నే నిద్రలేచి నగరంలోని రోడ్లు ఊడ్చే పనిలో నిమగ్నం కావటం ఆమె విధి నిర్వాహణ.. తన పై స్ధాయి అధికారులు తరచూ పర్యవేక్షణ కోసం నగరంలో తిరుగుతున్న సమయంలో వారిని దగ్గర గా గమనించిన ఆశ ఎలాగైనా తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంది.

అనుకున్నదే తడవుగా ఒకవైపు స్వీపర్ గా రోడ్లు ఊడ్చే ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదువుకుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎదురు చూస్తూ వాటికోసం చదవటం ప్రారంభించింది. ఈతరుణంలో 2018లో రాజస్ధాన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్  ఆర్ ఏ ఎస్ పరీక్షలు రాసింది. కారోనా కారణంగా ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. ఇటీవలే ఫలితాలు వెలువడగా అందులో ఆశా కు 728వ ర్యాంకు లభించింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు విభాగాల్లోనూ ఆశ ఉత్తీర్ణత సాధించింది. త్వరలో ఆశ డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టనుంది.

భర్త నుండి విడిపోయాక ఆశ సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. భర్తను వదిలేసిన మహిళాగా ఆమెను అంతా చిన్నచూపు చూశారు. ఇవన్నీ జీవితంలో ఎదిగేందుకు తన లక్ష్యంవైపు చేరేందుకు సమాజానికి తగిన సమాధానం ఇచ్చేందుకు దోహదపడ్డాయంటున్నారు ఆశ…చదవటం ద్వారానే తాను ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే స్ధాయికి చేరుకోగలిగాని చెప్తున్నారు. ఆశ పట్టుదలకు స్ధానికులంతా అభినందనలు తెలుపుతున్నారు.