రోహిణీ కార్తె : గ్రేటర్ లో పెరగనున్న ఎండలు..జాగ్రత్త

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 06:49 AM IST
రోహిణీ కార్తె : గ్రేటర్ లో పెరగనున్న ఎండలు..జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తె సమీపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలో దంచికొడుతున్నాయి. రామగుండం, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 22వ తేదీ శుక్రవారం నుంచి ఎండలు ఎక్కువగా ఉండడంతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఎండీ కూడా ఇవే హెచ్చరికలు చేసింది. వడగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వాయువ్యం వైపు నుంచి వేడి గాలులు వీస్తుండడంతో రాగల మూడు నాలుగు రోజులు గ్రేటర్ లో పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటే..ప్రజలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. రోహిణీ కార్తె సమీపిస్తున్న క్రమంలో..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర ఎండలో తిరగకుండా చూసుకోవాలంటున్నారు. ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా సేవించాలని, తల, మొహంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా చూసుకోవాలన్నారు. 

వేసవిలో ఎక్కువ మంది డీ హైడ్రేషన్ కు గురవుతుంటారు. ఎండ తాపానికి శరీరంలోని సోడియం, పొటాషియం, క్లోరైడ్ లవణాలు బయటకు వెళ్లిపోతుంటాయి. దీని కారణంగా శరీరంలో నీరు తగ్గిపోతుంది. ఈ సమయంలోనే పండ్ల రసాలు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలను ఎక్కువ సేపు ఎండలో ఆడనివ్వవద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పిల్లలతో బయటకు వెళితే..వెంట మజ్జిగ, గ్లూకోజ్ లాంటివి తీసుకెళ్లాలన్నారు. 

Read: రేపు, ఎల్లుండి ఏపీలో జాగ్రత్త.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు