Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లిని దాటేశాడు

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లిని దాటేశాడు

Rohit Sharma

Rohit Sharma : అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి (29 సార్లు) పేరు మీద ఉండేది. ఇప్పుడు దాన్ని రోహిత్ (30 సార్లు) చెరిపేశాడు. రోహిత్ 30 సార్లు 50 ప్లస్ కి పైగా పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీని (123 సార్లు) వెనక్కి నెట్టి రోహిత్ శర్మ (124 సార్లు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 264 50+ పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ (193), విరాట్ కోహ్లీ (188), సౌరబ్ గంగూలీ (144) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

ఇక రోహిత్ శర్మ మరో ఘనత కూడా సాధించాడు. టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన రెండో బ్యాట్స్ మెన్ గా రికార్డు నెలకొల్పాడు. 119 మ్యాచుల్లో 150 సిక్సులు బాదాడు. రోహిత్ కన్నా ముందు కివీస్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ ఉన్నాడు. అతడు 112 మ్యాచుల్లోనే 161 సిక్సులు బాదాడు. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మార్టిన్ గప్తిల్ ఘనత సాధించాడు. 107 ఇన్నింగ్స్ లో అతడు 3248 పరుగులు చేశాడు. అతడి తర్వాత విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ 95 మ్యాచుల్లో 87 ఇన్నింగ్స్ లు ఆడి 3227 పరుగులు చేశాడు.