Ram Charan: చరణ్‌తో‌ భారీ పాన్ ఇండియా మూవీకి స్కెచ్ వేస్తోన్న బాలీవుడ్ డైరెక్టర్.. ఎవరంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఇప్పుడు చరణ్ కోసం ఓ బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Ram Charan: చరణ్‌తో‌ భారీ పాన్ ఇండియా మూవీకి స్కెచ్ వేస్తోన్న బాలీవుడ్ డైరెక్టర్.. ఎవరంటే?

Rohit Shetty Planning A Pan India Movie With Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం చరణ్ అప్పుడే కథలు వింటున్నాడు.

Ram Charan: RRR సమయంలోనే చరణ్-సుకుమార్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి.. సంచలన నిజాలు బయటపెట్టిన సుకుమార్ అసిస్టెంట్..

గతంలోనే జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చరణ్ కోసం ఓ కథను రెడీ చేయగా, అది చరణ్‌కు నచ్చకపోవడంతో ఈ డైరెక్టర్‌కు నో చెప్పాడు. దీంతో చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అయితే ఇటీవల చెర్రీ-సుకుమార్ కాంబో మరోసారి రిపీట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇప్పుడు చరణ్ కోసం ఓ బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Ram Charan: రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఉందట.. కానీ ఆయనతో కాదట!

బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రోహిత్ శెట్టి, ఇప్పుడు సౌత్ హీరోలపై కన్నేశాడట. అందుకే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ భారీ యాక్షన్ మూవీని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఓ అదిరిపోయే కథను కూడా ఆయన రాసుకున్నాడట. ఇక త్వరలోనే ఈ కథను చరణ్‌కు వినిపించి, ఆయనతో ఓ భారీ పాన్ ఇండియా మూవీని తీయాలని రోహిత్ శెట్టి చూస్తున్నట్లుగా బి-టౌన్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.