Rohith Shetty : బాలీవుడ్‌కి ఎండ్ కార్డు వేయలేరు.. చాలా సార్లు బాలీవుడ్ పనైపోయిందన్నారు..

తాజాగా బాలీవుడ్ మాస్, కమర్షియల్ డైరెక్టర్ రోహిత్‌ శెట్టి బాలీవుడ్ పనైపోలేదు అంటూ సౌత్ వర్సెస్ బాలీవుడ్ సినిమాలు................

Rohith Shetty : బాలీవుడ్‌కి ఎండ్ కార్డు వేయలేరు.. చాలా సార్లు బాలీవుడ్ పనైపోయిందన్నారు..

Rohith Shetty

Rohith Shetty :   గత కొన్ని రోజులుగా ఒకపక్క సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలు సాధిస్తుంటే మరో పక్క బాలీవుడ్ సినిమాలు వరుస అపజయాలు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో ఒక్క భారీ హిట్ సినిమా కూడా లేదు. దీంతో అంతా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అని మాట్లాడుతున్నారు. ఇక బాలీవుడ్ పనైపోయింది అని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ నుంచి రావట్లేదు అని అంటున్నారు. ఈ టాపిక్ పై ఇప్పటికే చాలా మంది పలు వ్యాఖ్యలు చేశారు.

Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..

తాజాగా బాలీవుడ్ మాస్, కమర్షియల్ డైరెక్టర్ రోహిత్‌ శెట్టి బాలీవుడ్ పనైపోలేదు అంటూ సౌత్ వర్సెస్ బాలీవుడ్ సినిమాలు మీద మాట్లాడాడు. రోహిత్ శెట్టి మాట్లాడుతూ.. ”బాలీవుడ్‌కి ఎండ్‌ కార్డ్‌ వేయడం ఎవరివల్లా కాదు. 1980ల్లో వీసీఆర్‌లు వచ్చినప్పుడు ఇకపై ఎవరూ థియేటర్లకు రారు, బాలీవుడ్‌ పనైపోయిందన్నారు. ఇటీవల ఓటీటీ వచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు. బాలీవుడ్‌ కథ ఎప్పటికీ ముగిసిపోదు. అయినా గతంలో కూడా చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. 1980ల్లో అమితాబ్‌ బచ్చన్‌ లాంటి స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలుతున్నప్పుడే తమిళ్ నుంచి కమలహాసన్ వచ్చి హిట్స్ కొట్టారు. గతంలో కూడా కొన్ని సౌత్ సినిమాలు బాలీవుడ్ లో విజయం సాధించాయి. సౌత్, బాలీవుడ్ పరిశ్రమలు దేనికవే గొప్ప నటీనటులతో మంచి సినిమాలు తెరకెక్కిస్తున్నాయి. ఈ రెండు పరిశ్రమలను పోల్చి చూడటం వల్లే ఇలాంటి చర్చలు తెరపైకి వస్తున్నాయి. పోల్చకుండా ఎవరిగొప్ప వారిదే, ఎవరి సినిమాలు వారివే అన్నట్టు చూడాలి. రెండు చోట్ల హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు వస్తాయి” అని అన్నారు. మరి రోహిత్ చేసిన వ్యాఖ్యలపై సౌత్ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.