Rohtak villagers: ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థుల రూ.2.11 కోట్ల నగదు, కారు కానుక

హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని చిరీ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థులు రూ.2.11 కోట్ల నగదుతో పాటు ఓ స్కార్పియో ఎస్‌యూవీ కారును కానుకగా అందించారు. చిరీ గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. నవీన్ దలాల్, ధర్మపాల్‌ దలాల్‌ అనే నాయకులు పోటీ పడ్డారు. ఇందులో ధర్మపాల్ కేవలం 66 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత గ్రామంలో మళ్ళీ ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ధర్మపాల్ ను శాంతింపజేసేందుకు ఆయనకు కారు ఇవ్వాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు.

Rohtak villagers: ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థుల రూ.2.11 కోట్ల నగదు, కారు కానుక

Rohtak villagers

Rohtak villagers: హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని చిరీ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థులు రూ.2.11 కోట్ల నగదుతో పాటు ఓ స్కార్పియో ఎస్‌యూవీ కారును కానుకగా అందించారు. చిరీ గ్రామంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. నవీన్ దలాల్, ధర్మపాల్‌ దలాల్‌ అనే నాయకులు పోటీ పడ్డారు. ఇందులో ధర్మపాల్ కేవలం 66 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఎన్నికల తర్వాత గ్రామంలో మళ్ళీ ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ధర్మపాల్ ను శాంతింపజేసేందుకు ఆయనకు కారు ఇవ్వాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. అలాగే, గ్రామంలో అందరూ సోదరభావంతో మెలగాలని భావించారు.

తాజాగా, గ్రామస్థులు రూ.2.11 కోట్లు, స్కార్పియో ఎస్‌యూవీ కారును ధర్మపాల్ కు కానుకగా అందించారు. దీంతో ధర్మపాల్ సంతోషంగా వాటిని స్వీకరించి, గ్రామస్థులను మెచ్చుకున్నాడు. చిరీ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

తనకు గ్రామస్థులు ఇచ్చిన కానుకపై ధర్మపాల్ స్పందిస్తూ… ‘‘జీవితంలో గెలుపు, ఓటములు సాధారణమే. కానీ, గ్రామస్థులు నాకు ఇచ్చిన బలం మాత్రం నేనే విజేతను అన్న భావనను నాకు కలిగిస్తోంది. సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తిపై నాకు ఎలాంటి విద్వేషమూ లేదు. గ్రామ అభివృద్ధి కోసం అతడికి సహకరిస్తాను’’ అని ధర్మపాల్ చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..