Roorkee Gangrape: మహిళ, ఆమె ఆరేళ్ల కూతురుపై కారులో అత్యాచారం

కారులో వెళ్తున్న కొందరు యువకులు మహిళకు, ఆమె కూతురుకు లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఒక కాలువ దగ్గర వదిలేసి వెళ్లారు.

Roorkee Gangrape: మహిళ, ఆమె ఆరేళ్ల కూతురుపై కారులో అత్యాచారం

Roorkee Gangrape

Roorkee Gangrape: ఉత్తరాఖండ్‌, హరిద్వార్ జిల్లాలోని రూర్కీలో దారుణం జరిగింది. ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురుపై కారులో దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు పిరాన్ కలియార్ అనే ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్తున్నారు.

Jubilee Hills Rape Case: నిందితుల డీఎన్ఏ సేకరణకు పోలీసుల ఏర్పాట్లు

ఈ క్రమంలో అదే దారిలో కారులో వెళ్తున్న కొందరు యువకులు మహిళకు, ఆమె కూతురుకు లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఒక కాలువ దగ్గర వదిలేసి వెళ్లారు. తర్వాత ఎలాగోలా కష్టపడి ఆ మహిళ, తన కూతురుతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుంది. జరిగిన ఘటనను పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇద్దరిపై అత్యాచారం జరిగినట్లు ఆసుపత్రిలో డాక్టర్లు నిర్ధరించారు.

Tribals Arrest: ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన గిరిజనులు.. అరెస్టు చేసిన పోలీసులు

కాగా, ఎంత మంది నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారో బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోతుంది. డ్రైవర్ పేరు సోను అని మాత్రం పోలీసులకు చెప్పింది. ప్రస్తుతం బాధితులు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాల్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.